మోడీ ఎఫెక్ట్: బిజెపిలో యడ్యూరప్ప పార్టీ విలీనం?

BS Yeddyurappa and Narendra Modi
బెంగళూర్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కర్ణాటకలో బిజెపికి కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణాటక బడా నేత, కర్ణాటక జనత పక్ష (కెజెపి) అధ్యక్షుడు యడ్యూరప్ప బిజెపిలో రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. తన కెజిపిని బిజెపిలో విలీనం చేయడానికి ఆయన సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

బిజెపిలో పార్టీని విలీనం చేసే విషయంపై తుది నిర్ణయాన్ని కెజెపి కేంద్ర కార్యనిర్వాహకవర్గం యడ్యూరప్పకు వదిలేసినట్లు తెలుస్తోంది. నరేంద్రమోడీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని స్వాగతిస్తూ యడ్యూరప్ప పార్టీ లాంఛనంగా తీర్మానం చేసే అవకాశం ఉంది.

నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల యడ్యూరప్ప ఆనందంగా ఉన్నట్లు చెబుతున్నారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆయన ఇప్పటికే స్వాగతించారు. మోడీకి తాను మద్దుతు ఇస్తానని కూడా చెప్పారు. కెజెపి కీలక నాయకత్వం గురువారం సమావేశమై బిజెపిలో విలీనంపై చర్చించే అవకాశాలున్నాయి.

కర్ణాటకలోని ఓ వర్గం వ్యతిరేకిస్తుండడంతో యడ్యూరప్ప తిరిగి బిజెపిలోకి రావడంలో కాస్తా జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 18, 19 తేదీల్లో తమ పార్టీ సీనియర్ నేతలతో చర్చించి, బిజెపిలో పార్టీని విలీనం చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని యడ్యూరప్ప ఇది వరకే చెప్పారు. యడ్యూరప్పను తిరిగి పార్టీలోకి తీసుకుని రావడానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+