ఆ పార్టీతో పొత్తు విషయంలో మోదీ, అమిత్ షా డిసైడ్ చేస్తారు, మాజీ సీఎం పక్కా క్లారిటీ వచ్చింది !
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ పొత్తుపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప బుధవారం ఢిల్లీ వెళ్లారు. అంతకుముందు బీఎస్ యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ బీజేపీ-జేడీఎస్ పొత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడిన బీఎస్. యడ్యూరప్ప లోక్‌సభ ఎన్నికలపై సీఈసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉందన్నారు. ఈరోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది, నేను రేపు తిరిగి బెంగళూరు రావాలనుకుంటున్నాను. లోక్‌సభ ఎన్నికల సన్నాహకాలపై చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను అని బీఎస్ యడియూరప్ప అన్నారు..

దీనిపై జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ పొత్తు విషయంలో బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తామని అన్నారు. వినాయక చవితి పండుగ తర్వాతే ఈ అంశంపై చర్చ జరుగుతుందని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి చెప్పారు. పొత్తుకు ఇంకా సమయం ఉందని, మేము తొందరపడటం లేదని, జేడీఎస్ పార్టీలో సమగ్ర చర్చ జరగాలని, వినాయక చవితి పండుగ తర్వాత ఈ విషయంప మాట్లాడుదామని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

అయితే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నాలుగు సీట్లకు జేడీఎస్ కు ఇచ్చేందుకు అంగీకరించారని బీఎస్ యడ్యూరప్ప గతంలోనే మీడియాకు చెప్పారు. ఈ నెలాఖరులోగా సీట్ల కేటాయింపుపై చర్చ జరిగే
అవకాశం ఉందని బీజేపీ, జేడీఎస్ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. మొత్తం మీద 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని తెలిసింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications