ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం, జ్వరం, రక్తపోటు, ఆందోళన వద్దంటున్న అపోలో !
ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిఆందోళన వద్దని చెప్పిన అపోలో ఆసుపత్రి వైద్యుడురెండు రోజులు ఆసుపత్రిలోనే, జ్వరం, రక్తపోటు, నీరసంతో
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బీఎస్. యడ్యూరప్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. బెంగళూరు నగరంలోని బన్నేరుఘట్ట రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో బీఎస్. యడ్యూరప్ప (74) చికిత్స పొందుతున్నారు.
జ్వరం, నరాల నొప్పులు, రక్తపోటు కారణంగా బుధవారం రాత్రి బన్నేరుఘట్ట రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో బీఎస్. యడ్యూరప్ప చేరారు. బీఎస్. యడ్యూరప్పకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సీనియర్ వైద్యుడు డాక్టర్ ప్రమోద్ చెప్పారు.

మాజీ సీఎం యడ్యూరప్పకు చాల నీరసంగా ఉన్నందున ఇంకా రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని డాక్టర్ ప్రమోద్ అన్నారు. రక్తపోటు అదుపులోకి వచ్చిందని, జ్వరం నయం అయ్యిందని, యడ్యూరప్ప ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని డాక్టర్ ప్రమోద్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications