ప్రతిభకు దక్కిన ఫలితం.. అంతర్జాతీయ క్రీడల్లో సత్తా చాటిన BSF జవాన్లకు పదోన్నతి
నేషనల్, ఇంటర్నేషనల్ క్రీడల్లో సత్తా చాటిన సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్లకు ఘనంగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన BSF డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి.. యువ క్రీడా కారులను అభినందించారు. ఓ వైపు దేశ సేవ చేస్తూనే మరోవైపు యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతున్నారని కొనియాడారు. ఈ మేరకు దిల్లీలోని BSF హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
నేషనల్, ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇటీవల జరిగిన వరల్డ్ పోలీస్ ఫైర్ గేమ్స్, ఆల్ ఇండియా పోలీస్ షూటింగ్ కాంపిటీషన్ 2024, వరల్డ్ వుషు ఛాంపియన్‌షిప్ 2025 సత్తా చాటి పతకాలు సాధించిన సరిహద్దు భద్రతా దళం (BSF) క్రీడాకారులను ఘనంగా సత్కరించింది బీఎస్ఎఫ్. ఈ మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన BSF డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి.. క్రీడా కారులను అభినందించారు. క్రీడాకారుల విజయాలను కొనియాడుతూ నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమం భవిష్యత్తు క్రీడాకారులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని BSF డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఎస్ఎఫ్ సెంట్రల్ వుషు జట్టుకు చెందిన కానిస్టేబుల్ అనుజ్ ఏప్రిల్ 2025లో చైనాలోని జియాంగిన్ లో జరిగిన 10వ శాండా ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించాడు. అతడి అద్భుతమైన ప్రతిభకు గుర్తుగా అతనికి కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించారు అధికారులు. ఇలా పదోన్నతి కల్పించడం దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇక షూటింగ్ విభాగంలో, ఆల్ ఇండియా పోలీస్ షూటింగ్ పోటీ 2024లో బీఎస్ఎఫ్ షూటర్ల జట్టు మహిళా ఛాంపియన్‌షిప్ ను గెలుచుకుంది. అంతేకాక పురుషుల బెస్ట్ రైఫిల్ ట్రోఫీ, మహిళల బెస్ట్ రైఫిల్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో బీఎస్ఎఫ్ షూటర్లు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని ఈ విజయం చాటి చెప్పింది.
అలబామా, USAలో జరిగిన ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్ లో బీఎస్ఎఫ్ జట్టు 38 బంగారు పతకాలతో సహా మొత్తం 74 పతకాలను గెలుచుకుంది. అంతేకాక 2024లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ షూటింగ్ పోటీలో వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన సిబ్బందికి సైతం నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

ఈ కార్యక్రమం జవాన్ల అద్భుతమైన విజయాలను సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ప్రతిభ, కృషిని గుర్తించాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కానిస్టేబుల్ అనుజ్ కు లభించిన పదోన్నతి అసాధారణమైన విజయాలను ఎలా గుర్తించాలో వివరిస్తుంది. ఇలాంటి గుర్తింపు.. మరింత కష్టపడి పనిచేయడానికి, కొత్త శిఖరాలను అధిరోహించడానికి, ప్రపంచ క్రీడా వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి స్ఫూర్తినిస్తుంది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications