బిఎస్ఎఫ్ కాల్పుల్లో పాక్ డ్రగ్స్ స్మగర్లు హతం
ఛండీఘర్: పంజాబ్ రాష్ట్రం గత కొన్ని సంవత్సరాలుగా మాదక ద్రవ్యాల కేంద్రంగా మారుతోంది. కాగా, పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం ఉదయం స్మగ్లర్లపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు డ్రగ్స్ స్మగ్లర్లు హతమైనట్లు అధికారులు వెల్లడించారు.
పాక్ స్మగ్లర్ల నుంచి మాదకద్రవ్యాలను తీసుకునేందుకు వీరంతా ఖేమ్కరణ్ సెక్టార్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు భారత్ చెందినవారు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి 10కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవల పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. భద్రతా సిబ్బంది గస్తీ ముమ్మరం చేశారు.
సరిహద్దు ప్రాంతమంతా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్మగ్లర్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పఠాన్‌కోట్ దాడి సయంలోనూ పోలీసులు.. నలుగురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications