ఆగని పాకిస్థాన్ మత్స్యకారుల ఆగడాలు.. గుజరాత్‌లో ఏడు ఫిషింగ్ బోట్లు సీజ్
భారత్ భద్రతా బలగాలు ఎన్ని చర్యలు చేపట్టినా పాకిస్థాన్ జాలర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. గుజరాత్ కేంద్రంగా చేసుకుని అక్రమంగా దేశంలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని భుజ్ జిల్లాలోని క్రిక్ తీరప్రాంతంలో ఏడు ఫిషింగ్ బోట్లను బీఎస్ఎఫ్ సీజ్ చేశారు. ఈ ప్రాంతంలో మరికొన్ని పాక్ పడవలు ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ భుజ్ జిల్లాలోని క్రిక్ తీర ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం కొత్తగా ఏడు ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ పీఆరోవో వెల్లడించారు. క్రిక్ క్రొకడాయిల్ కమాండ్ టీమ్స్ ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. హరామి ప్రాంతంలో ఈ బోట్లను బీఎస్ఎఫ్ టీం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొనారు. పాక్ కు చెందిన ఈ బోట్లలో కుళ్లిన చేపలు, ఉన్నాయని తెలిపారు. ఇటీవల పాక్ చెందిన మత్యకారులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ప్రాంతంతో తనిఖీలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

గుజరాత్‌లోని భుజ్ జిల్లా క్రిక్ తీరంలో పాకిస్థాన్‌కు చెందిన బోట్లు పదుల సంఖ్యలలో చేరుకున్నాయి. వీటి రాకను బీఎస్ఎఫ్ గస్తీ బృందాలు పసిగట్టాయి. ఈనేపథ్యంలో ఈనెల 9న వాయుసేనకు చెందిన హెలీకాప్టర్ ద్వారా హరామి నల్లా తీర ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న 11 పాకిస్థాన్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు పాక్ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు చెందిన మత్స్యకారులకు అడ్డుకట్టకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. తీర ప్రాంతల్లో గస్తీని ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications