వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్కెట్లో సాయుధుల కాల్పులు, పరారీ: బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ జిల్లాలో సాయుధులు ఓ మార్కెట్లో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఒకతను మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది.

శ్రీనగర్‌కు 52 కిలోమీటర్ల దూరంలో గల దుకాణం వద్ద నిలబడి ఉన్న బిఎస్ఎన్ఎల్ లేదా భారత్ సంచార్ నిగమ్ ఉద్యోగులను ఉగ్రవాదులు లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన దుండగుడు పారిపోయాడు.

BSNL Employee Killed in Sopore, Jammu and Kashmir; Gunmen Escape

బిఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజ్ ఇక్రా టెలికమ్‌లో ముగ్గురు అధికారులు పనిచేస్తున్నారు.వారిలో మొహమ్మద్ రఫీక్ (26) అనే ఉద్యోగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మిగతా ఇద్దరికి శ్రీనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు.

దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో సైనిక శిబిరం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ సైనిక జవాను గాయపడ్డాడు. గత 48 గంటల లోపలే సోపోర్‌లో రెండు దాడులు జరిగాయి. మొబైల్ ట్రాన్స్‌మిషన్ టవర్ ఉన్న ఆవాస కూడలిపై ఉగ్రవాదులు శనివారంనాడు గ్రెనేడ్లు విసిరారు. కాశ్మీర్ లోయలో గత నెలలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, ఒకతను గాయపడ్డాడు.

English summary
An official of the government-run telecom operator BSNL was killed and two more were injured today after gunmen opened fire at a crowded market in north Kashmir's Sopore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X