జియోకు బిఎస్ఎన్ఎల్ షాక్: రోజుకు 2 జీబీ డేటా,వాయిస్ కాల్స్ కూడ ఉచితమే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:రిలయన్స్ జియో కంపెనీ ఉచిత ఆఫర్లను తీసుకురావడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఉచిత ఆఫర్లను అనివార్యంగా తెస్తున్నాయి. తాజాగా బిఎస్ఎన్ ఎల్ కూడ ఉచిత డేటా ఆఫర్ ను ప్రకటించింది.

ఆరుమాసాల పాటు ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటాను ఇస్తోన్న రిలయన్స్ జియో ఏప్రిల్ మాసం నుండి తన కస్టమర్ల నుండి బిల్లులను వసూలు చేయనుంది.రిలయన్స్ జియో ఇచ్చిన ఉచిత ఆఫర్లను పోలిన తరహలోనే ఇతర టెలికం కంపెనీలు కూడ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

అయితే రిలయన్స్ తన టారిఫ్ ప్లాన్ ను ప్రకటించింది.అయితే ఈ టారిఫ్ ప్లాన్ల ప్రకారంగా ఇతర టెలికం కంపెనీలు కూడ ఉచిత ఆఫర్లను ప్రకటించాయి. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ తాజాగా బిఎస్ఎన్ఎల్ కూడ ఉచిత ఆఫర్లను ప్రకటించాయి.

అయితే ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియోవైపు తమ కస్టమర్లు వెళ్ళిపోకుండా ఉండేందుకుగాను ఇతర టెలికం కంపెనీలు కూడ ఉచిత ఆఫర్లను ప్రకటించాయి.

బిఎస్ఎన్ఎల్ ఉచిత ఆఫర్

బిఎస్ఎన్ఎల్ ఉచిత ఆఫర్

రిలయన్స్ జియోతో పోటీని తట్టుకొనేందుకుగాను బిఎస్ఎన్ఎల్ కూడ ఉచిత ఆఫర్ ను ప్రకటించింది.


ఈ ప్రైవేట్ టెలికం సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడ ఉచిత ఆఫర్ ను ప్రకటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ప్రైవేట్ కంపెనీల పోటీని తట్టుకొని మార్కెట్లో నిలబడాలంటే ఉచిత ఆఫర్లను ప్రకటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని బిఎస్ఎన్ఎల్ కన్స్యూమర్ మొబిలిటీ డైరెక్టర్ ఆర్ కె మిట్టల్ చెప్పారు.

రూ.339 రీచార్జ్ తో 2 జీబీ డేటా

రూ.339 రీచార్జ్ తో 2 జీబీ డేటా


బిఎస్ఎన్ ఎల్ కూడ తన కస్టమర్ల కోసం ఉచిత డేటా ఆఫర్ ను ప్రకటించింది. కొత్త ప్లాన్ లో రూ.339 రీచార్జ్ చేసుకొంటే రోజుకు 3 జీ 2జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు బిఎస్ఎన్ఎల్ గురువారం నాడుప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ నుండి బిఎస్ఎన్ఎల్ ఫోన్లకు అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది.

ఇతర నెట్ వర్క్ లకు కూడ ప్రతి రోజు ఉచిత కాల్స్

ఇతర నెట్ వర్క్ లకు కూడ ప్రతి రోజు ఉచిత కాల్స్

ప్రైవేట్ టెలికం కంపెనీలతో పోటీని ఎదుర్కొనేందుకుగాను ఉచిత ఆపర్ ను ప్రకటించింది బిఎస్ఎన్ఎల్.

అయితే ఇతర నెట్ వర్క్ ఫోన్ లకు ప్రతి రోజు 25 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడే సదుపాయాన్ని కూడ బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది.తమ కస్టమర్ల కోసం తక్కువ ధరలకే సేవలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నామని బిఎస్ఎన్ఎల్ కన్స్యూమర్ మొబిలిటీ డైరెక్టర్ ఆర్ కె మిట్టల్ చెప్పారు.

28 రోజుల పాటు వ్యాలిడిటీ

28 రోజుల పాటు వ్యాలిడిటీ

రూ.339 రీ చార్జీ చేసుకొంటే 28 రోజుల పాటు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. స్పెషల్ టారిఫ్ ఓచర్ కింద రీ చార్జ్ చేసుకొన్న కస్టమర్లకు ఉచితంగా ఈ డేటా అందుతోంది.ఉచిత ఆఫర్ తమ కస్టమర్లు ఇతర నెట్ వర్క్ ల వైపు వెళ్ళకుండా ఉంటారని బిఎస్ఎన్ఎల్ భావిస్తోంది.

రిలయన్స్ ఉచిత ఆఫర్ల కారణంగా ఇతర టెలికం కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నష్టనివారణ కోసం టారిఫ్ ప్లాన్లతో పాటు ఇతర ఆఫర్లను ప్రకటించాయి టెలికం కంపెనీలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
To counter threat from Reliance Jio, state-run telecom firm BSNL on Thursday launched a new plan that offers 2GB of 3G data per day and unlimited calling within its network for Rs. 339.
Please Wait while comments are loading...