బీఎస్‌ఎన్‌ఎల్ ‘లూట్ లో’ ఆఫర్.. యూజర్లకు 500 శాతం అధిక డేటా!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ‘లూట్ లో’ పేరిట తాజాగా ఓ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 'లూట్ లో' పేరిట తాజాగా ఓ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టింది.
ఇందులో భాగంగా వినియోగదారులకు పలు ప్లాన్లపై 60 శాతం డిస్కౌంట్ లభించడంతోపాటు ఏకంగా 500 శాతం అదనపు డేటా వస్తుంది. మొత్తం 7 పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది.

రూ.225, రూ.325, రూ.525, రూ.725, రూ.799, రూ.1,125, రూ.1,525 ప్లాన్లను వాడుతున్న యూజర్లకు వరుసగా 500 ఎంబీ, 3 జీబీ, 7 జీబీ, 15 జీబీ, 30 జీబీ, 60 జీబీ, 90 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటాను ఎలాంటి స్పీడ్ పరిమితి లేకుండా హైస్పీడ్‌లో వాడుకోవచ్చు.












Click it and Unblock the Notifications