వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Uttar Pradesh Elections 2022 : రూటు మారుస్తున్న మాయా-బ్రహ్మణులు ఇన్-నేరస్తులకు చెక్

|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆ తర్వాత తన స్వయం కృతాలతో అధికారానికి దూరమయ్యారు. ఇప్పుడు వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ లో జరిగే ఎన్నికల్లో మరోసారి తన ప్రతాపం చూపాలని భావిస్తున్న మాయావతి.. గత తప్పిదాలను పునరావృతం చేయకూడదని నిర్ణయించారు. అదే సమయంలో ఒకప్పుడు తనను, తన పార్టీని జనానికి దూరం చేసిన విధానాలను పక్కనబెట్టాలని భావిస్తున్నారు. దీంతో ఇక ఈసారి ఎన్నికల్లో మారిన మాయావతిని యూపీ ప్రజలు చూడబోతున్నారు.

 మాయా ప్రస్ధానం

మాయా ప్రస్ధానం

కులాల కుంపట్లు ఎక్కువగా ఉండే ఉత్తర్ ప్రదేశ్ లో ఒకప్పుడు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అధికారాన్ని కైవసం చేసుకుని ప్రత్యర్ధులకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతి అధికారంలోకి వచ్చాక మాత్రం తన అజెండాను బయటికి తీశారు. ప్రత్యర్ధులను టార్గెట్ చేయడం దగ్గరి నుంచి పార్కులు, విగ్రహాలు కట్టడం వరకూ, బ్రహ్మణులను దూరం చేసుకోవడం దగ్గరి నుంచి నేరస్తులను చేరదీయడం వరకూ మాయవతి చేయని పనులు లేవు. దీంతో ఆమె సహజంగానే అక్కడి ఓటర్లకు దూరమైపోయారు. చివరికి తన పార్టీలో ఓ ఎంపీని గెలిపించుకోవడం కోసం ఒకప్పటి ప్రత్యర్ధులైన సమాజ్ వాదీ పార్టీ యాదవులను దేబిరించాల్సిన పరిస్ధితి దాపురించింది. దీంతో ఇప్పుడు ఆమెకు జ్ఞానోదయమైనట్లు కనిపిస్తోంది.

 రూటుమారుస్తున్న మాయా

రూటుమారుస్తున్న మాయా

ఒకప్పుడు తనకు అధికారాన్ని అందించిన సోషల్ ఇంజనీరింగ్ మంత్రాన్ని ఆ తర్వాత వదిలేసిన మాయావతి ఇప్పుడు మరోసారి దానిపైనే ఆధారపడేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బ్రహ్మణులకు తగినన్ని సీటలు ఇస్తామని తాజాగా మాయావతి ప్రకటించారు. తద్వారా బీఎస్పీ బ్రహ్మణ వ్యతిరేక పార్టీ అన్న ముద్రను చెరిపేసుకునేందుకు మరో గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. యూపీలో అధికంగా ఉన్న బ్రహ్మణులను గతంలో దగ్గరకు చేర్చుకుని గతంలో సోషల్ ఇంజనీరింగ్ మంత్రం జపించిన మాయావతి అనుకున్న ఫలితాలు సాధించారు. ఇప్పుడు మరోసారి అదే మంత్రం తనను గట్టెక్కిస్తుందని మాయా బలంగా భావిస్తున్నారు.

 విగ్రహాలు, పార్కులకూ దూరం

విగ్రహాలు, పార్కులకూ దూరం

గతంలో మాయావతి అధికారం చేపట్టిన తర్వాత యూపీలో భారీ ఎత్తున పార్కులు, విగ్రహాలు నిర్మించారు. అందులోనూ బీఎస్పీ గుర్తు అయిన ఏనుగుల ప్రతిమలు ఎక్కడపడితే అక్కడ కనిపించేవి. చివరికి వీటిపై జనానికి విరక్తి వచ్చే వరకూ పరిస్ధితి వెళ్లింది. దీంతో ఆ తర్వాత ఎన్నికల్లో మాయాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చివరికి వీటిపైనా విశ్లేషణ జరిపిన మాయా తన తప్పిదాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ఎక్కడా కొత్త విగ్రహాలు, పార్కులు నిర్మించబోనని ప్రతిజ్ఞ చేశారు. తద్వారా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిన ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు మాయా ప్రయత్నిస్తున్నారు.

 మాఫియా, నేరస్తులకూ చెక్

మాఫియా, నేరస్తులకూ చెక్

అలాగే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నేరస్తులు, రౌడీ షీటర్లు, మాఫియా నేతలకు తమ పార్టీ తరఫున టికెట్లు ఇవ్వబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి మరో కీలక ప్రకటన చేశారు. వాస్తవానికి యూపీలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు ముందు ఇవే ప్రకటనలు చేస్తుంటాయి. కానీ ఎన్నికల నాటికీ మాత్రం తమ అవసరాల కొద్దీ మాఫియా నేతలకూ, నేరస్తులకు టికెట్లు కేటాయించడం పరిపాటిగా వస్తోంది. అందుకే జనం ఈ హామీని విశ్వసించే పరిస్ధితి లేదు. దీంతో మాయావతి జైలుకు వెళ్లి వచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని ఇప్పుడే ప్రకటించేశారు. ఆయన స్ధానంలో మౌ అసెంబ్లీ సీటులో పార్టీ యూపీ ఛీఫ్ భీమ్ రాజ్ భర్ ను నిలబెట్టాలని నిర్ణయించారు.

 బీజేపీ, ఎస్పీలే టార్గెట్ గా మాయా పావులు ?

బీజేపీ, ఎస్పీలే టార్గెట్ గా మాయా పావులు ?

యూపీలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కంటే ముందు ఎస్పీ నేత ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నారు. వీరిద్దరి పాలనలోనూ గ్యాంగ్ స్టర్లు చెలరేగిపోయారు. విచ్చలవిడిగా దౌర్జన్యాలు, హత్యలు చేశారు. యోగీ పాలనలో అయితే ఏకంగా 3 వేలకు పైగా ఎన్ కౌంటర్లు చేసి ఇందులో చాలా మందిని మట్టుబెట్టారు. అయితే ఇంకా యూపీలో మాఫియా నేతల హవా తగ్గలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో నేరస్తులకు, మాఫియా నేతలకు టికెట్లు నిరాకరించడం ద్వారా ప్రజల్లో అనుకూలత మూటగట్టుకోవాలని మాయావతి ప్లాన్ చేస్తున్నారు. సచ్చీలులైన నేతలకు తాము టికెట్లు ఇచ్చామన్న సంకేతాలు ఇప్పటినుంచే పంపేదుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా బీజేపీ, ఎస్పీలకు సవాల్ విసురుతున్నారు. మరి ప్రజలు ఆమెను మరోసారి విశ్వసిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

English summary
bsp chief mayavathi annouced her poll strategy for upcoming uttarpradesh elections in 2022. for this mayavati plans to woo brahmins and changes her strategy on parks, idols and criminals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X