వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళితులు, ముస్లింలే లక్ష్యంగా బిఎస్ పి టిక్కెట్ల పంపిణీ,సమాజ్ వాదీకి ఆమె చెక్ పెడతారా ?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్ పి అధినేత్రి మాయావతి వ్యూహత్మకంగా అడుగులువేస్తోంది.సమాజ్ వాదీ పార్టీలో చోటుచేసుకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఓటర్లను.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్ పి అధినేత్రి మాయావతి వ్యూహత్మకంగా అడుగులువేస్తోంది.సమాజ్ వాదీ పార్టీలో చోటుచేసుకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకుగాను బిఎస్ పి కసరత్తుచేస్తోంది. టిక్కెట్ల కేటాయింపులో కూడ బిఎస్ పి వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను బిఎస్ పి ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. సమాజ్ వాదీ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఐదేళ్ళ క్రితం వరకు ఈ రాష్ట్రంలో బిఎస్ పి అధికారంలో ఉంది.
ఈ దఫా ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు జాగ్రత్తగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుండి ప్రచారం వరకు అన్ని విషయాల్లో ఆ పార్టీ జాగ్రత్తలు తీసుకొంటుంది.

సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోనేలా బిఎస్ పి వ్యూహరచన చేస్తోంది. సమాజ్ వాదీకి అండగా ఉన్న వర్గాలను తన వైపుకు తిప్పుకొనేలా బిఎస్ పి ప్రయత్నాలను ప్రారంభించింది.

ముస్లిం, దళితు ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బిఎస్ పి

ముస్లిం, దళితు ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బిఎస్ పి

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు, ముస్లింల ఓట్లను తమ పార్టీ వైపుకు తిప్పుకొనేలా బిఎస్ పి వ్యూహ రచన చేస్తోంది. ఈ మేరకు టిక్కెట్ల కేటాయింపులో కూడ ఈ రెండు వర్గాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది ఆ పార్టీ. సమాజ్ వాదీ పార్టీకి ముస్లింటు అండగా ఉంటూ వచ్చారు. అయితే సమాజ్ వాదీ పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ముస్లిం ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేలా ఆ పార్టీ కసరత్తుచేస్తోంది.

సగం సీట్లు దళితులు, ముస్లింలకే ఇచ్చిన బిఎస్ పి

సగం సీట్లు దళితులు, ముస్లింలకే ఇచ్చిన బిఎస్ పి

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్ పి దళితులు , ముస్లింలు లక్ష్యంగా టిక్కెట్లను కేటాయించింది. ఇప్పటివరకు మూడువందలకు పైగా టిక్కెట్లను ఖరారు చేసింది ఆ పార్టీ అధినేత్రి మాయావతి, ఇందులో 97 మంది ముస్లింలకు, 87 మంది దళితులకు టిక్కెట్లను కేటాయించింది. ఇప్పటికి ప్రకటించిన స్థానాల్లో సగానికి పైగా సీట్లను ముస్లింలు, దళితులకే కట్టబెట్టారు బిఎస్ పి అధినేత్రి మాయావతి.

కొత్త ఫార్మూలాను అనుసరిస్తోన్న మాయావతి

కొత్త ఫార్మూలాను అనుసరిస్తోన్న మాయావతి


సమాజ్ వాదీ పార్టీ కంటే ముందుగా అధికారంలో ఉన్న సమయంలో బిఎస్ పి అనుసరించిన ఫార్మూలా ప్రత్యర్థులను కూడ ఖంగుతినిపించింది. ఆ సమయంలో ఆ పార్టీ దళితులు, బ్రహ్మణుల ఫార్మూలాను అనుసరించింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడ బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడ అధికంగానే ఉంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆనాడు ఆమె అనుసరించిన ఫార్మూలా ఆ పార్టీకి కలిసివచ్చింది. ఈ నేపథ్యంలో బిఎస్ పి అధికారంలోకి వచ్చింది. ఆనాడు తన మంత్రివర్గంలో బ్రహ్మణులకు కూడ చోటు కల్పించింది.

పార్టీల విజయాాలపై ప్రభావం చూపే ముస్లిం ఓట్లు

పార్టీల విజయాాలపై ప్రభావం చూపే ముస్లిం ఓట్లు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 12 ఓట్లు ముస్లింలకు ఉన్నాయి. ఐదేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో ముస్లింలు సమాజ్ వాదీ పార్టీ వైపుకు మొగ్గుచూపారు. దరిమిలా సమాజ్ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలు ఇబ్బందికరంగా ఉన్నాయి.తండ్రీ కొడుకులు పార్టీపై ఆధిపత్యం కోసం గొడవపడుతున్నారు. ఈ తరుణంలో సమాజ్ వాదీ పార్టీ వెనుక ఉన్న వర్గాలను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావించిన బిఎస్ పి కొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తోంది.

English summary
bsp targeted muslim, dalit votes in uttrar pradesh assembly elections. bsp releaased around 300 members list for contest candidates in assembly election, half of the candidates from muslims and dalits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X