మహాకూటమికి మాయావతి షాక్: కాంగ్రెస్‌ పై తన వైఖరి స్పష్టం చేసిన బెహెన్‌జీ

లక్నో: బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన మహాకూటమికి బీఎస్పీ అధినేత్రి ఫైర్ బ్రాండ్ మాయావతి గట్టి షాక్ ఇచ్చారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో దేశవ్యాప్తంగా ఎక్కడే కానీ పొత్తు ఉండదని మాయావతి తేల్చి చెప్పారు. దీంతో మహాకూటమిలో కూడా ఎస్పీ - బీఎస్పీ-ఆర్ఎల్‌డీ కూటమి ఉండదనే సంకేతాలు పంపించినట్లు అయ్యింది. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోదని మరోసారి స్పష్టం చేస్తున్నట్లు మాయావతి తెలిపారు. గుజరాత్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా మాయావతి ఈ ప్రకటన చేయడం విశేషం.

ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ బీఎస్పీ పొత్తుతో వెళుతోందంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని మాయావతి అన్నారు. రెండు పార్టీలు నిజాయితీతో పనిచేస్తాయని చెప్పిన మాయావతి ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీని మట్టి కరిపించేందుకు తమ కూటమి చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. జనవరిలో బీఎస్పీ ఎస్పీ పొత్తు ఖరారు అయ్యింది. కాంగ్రెస్‌ను ఈ రెండు పార్టీలు కలుపుకోలేదు.అయితే రాయ్‌బరేలీ, అమేథీలలో మాత్రం తమ అభ్యర్థులను నిలపకూడదని రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి.

BSP will have no ties with Cong anywhere in India, says Mayawati

ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలుండగా ఎస్పీ 37 స్థానాలు... బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనుండగా... అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్‌డీ పార్టీ 3 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక బీఎస్పీ తమ మెజార్టీ అభ్యర్థులను పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ నిలుపుతోంది. ఇందులో సహరన్ పూర్, బిజ్నోర్, నాగిన, అమ్రోహా, మీరట్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్ షహర్, అలిఘర్, ఆగ్రా, ఫతేపూర్ సీక్రీ నియోజకవర్గాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+