బడ్జెట్ 2014 పూర్తి వివరాలు: ఎఫ్‌డీఐలు నాడు వద్దని
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేడు (గురువారం) పదకొండు గంటలకు పార్లమెంటులో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆయన పదకొండు గంటలకు బడ్జెట్ ప్రవేశ పెడతారు. విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బడ్జెట్ పైన కోటి ఆశలు పెట్టుకున్నాయి. మోడీ ప్రభుత్వం తొలి సాధారణ బడ్జెట్ కావడంతో అందరి కళ్లు దీని పైనే ఉన్నాయి.
మొత్తం కేంద్ర బడ్జెట్ 17.9 లక్షల కోట్లు.
ప్రణాళికేతర వ్యయం 12.2 లక్షల కోట్లు.
ప్రణాళిక వ్యయం రూ.5.75 లక్షల కోట్లు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/6nop1wsvo74?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
బడ్జెట్ ప్రసంగానికి ముందు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు.. ప్రసంగం అనంతరం ఒక్కసారిగా పుంజుకున్నాయి. స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. మధ్యాహ్నం వరకు నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో, సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో ఉంది.
స్టెయిన్ లెస్ స్టీలు పైన కస్టమ్స్ డ్యూటీ పెంపు.
బాక్సైట్ ఎగుమతుల పైన ఎక్సైజ్ డ్యూటీ పెంపు
బాక్సైట్ ఎగుమతుల పైన ఎక్సైజ్ డ్యూటీ పెంపు
శీతల పానీయాల పైన పన్ను పెంపు.
ఐరన్ తగ్గే అవకాశం.
సిగరేట్ల పైన ఎక్సైజ్ డ్యూటీ 11 శాతం నుండి 72 శాతానికి పెంపు. సిగరేట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం.
పర్‌ఫ్యూమ్స్ తగ్గే అవకాశం.
స్టెయిన్ లెస్ స్టీలు పైన కస్టమ్స్ డ్యూటీ పెంపు.
ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.22వేల కోట్ల రెవెన్యూ లోటు.
సున్నపురాయి, డోలమైట్ పైన పన్ను రాయితీ.
సీఆర్‌టీవీ టీవీల పైన కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
పెట్రో కెమికల్స్ పైన కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
ఉక్కు పైన దిగుమతి సుంకం 7.5 శాతానికి పెంపు.
ఎలక్ట్రానిక్ గూడ్స్ పైన ఎడ్యుకేషన్ సెస్
ద్రవ్యలోటు 4.5 శాతం.
సర్‌ఛార్జీ, ఎడ్యుకేషన్ సెస్‌లో మార్పు లేదు
పవర్ సెక్టార్ పైన మరో పదేళ్లు ట్యాక్స్ హాలీడే
పొదుపు పథకాలపై లక్షన్నర వరకు పన్ను మినహాయింపు
గృహ నిర్మాణాల పైన రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు
ఇన్ కం ట్యాక్స్ సర్ ఛార్జీల్లో మార్పు లేదు.
80సీసీ పరిమితి రూ.లక్షన్నరకు పెంపు.
ఏషియన్, కామన్వెల్త్ క్రీడల్లో శిక్షణ కోసం రూ.100 కోట్లు.
విదేశాల్లో భారత కంపెనీల లిస్టింగ్ సులభతరం.
గంగా ప్రక్షాళనకు రూ.2,037 కోట్లు.
పౌర విమానయానరంగంపై ప్రత్యేక దృష్టి.
మావోయిస్టు ప్రాంతాల్లో బలగాల కోసం రూ.3వేల కోట్లు.
కాశ్మీర్ పండిట్ల పునరావాసానికి రూ.500 కోట్లు.
ఆదాయపన్ను పరిమితి రు.2 లక్షల నుండి 2.5 లక్షలకు పెంపు. సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలకు పెంపు.
ఎఫ్‌సీఐలో సంస్కరణలు
రక్షణ రంగంలో పరిశోధనలకు రూ.100 కోట్లు.
చారిత్రక నగరాల అభివృద్ధికి రూ.400 కోట్లు.
ఈశాన్య రాష్ట్రాల్లో హైవేలకు రూ.3 వేలకోట్లు.
రైతులకు భూనాణ్యత కార్డుల కోసం రూ.100 కోట్లు.
పీపీఎఫ్ స్కీమ్ రూ.లక్ష నుండి లక్షన్నరకు పెంపు.
పెండింగ్ ఇన్సురెన్స్ బిల్లులు పూర్తి చేస్తాం.
వార్ మెమోరియల్ కోసం రూ.100 కోట్లు.
గంగానదిలో జలమార్గం కోసం నాలుగువేల కోట్ల అంచనా వ్యయం.
కొత్త బ్యాంకులకు లైసెన్సులు.

రక్షణ రంగానికి రూ.2.29 లక్షల కోట్లు.
ఆర్మీలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్.
నిర్మాణ రంగానికి సులభంగా రుణాలు.
మోడీ గెలిచిన వారణాసికి ట్రెడ్ ఫెసిలిటేషన్ సెంటర్
జాతీయ, రాష్ట్ర రహదాలు అభివృద్ధికి రూ.37,850 కోట్లు.
అన్ని ఆర్థిక లావాదేవీలకు ఒకే డీమ్యాట్ అకౌంట్.
జాతీయ పారిశ్రామిక కారిడార్‌కు రూ.100 కోట్లు.
సౌర విద్యుత్ ప్రాజెక్టులకు రూ.500 కోట్లు.
రూ.11,635 కోట్లతో పోర్టుల అభివృద్ధి.
లక్నో, అహ్మదాబాదులకు మెట్రో ప్రాజెక్టులు.
వ్యవసాయ రంగంలో నాలుగు శాతం వృద్ధి లక్ష్యం.
అప్రెంటిస్ షిప్ సవరణలు చేస్తాం.
రూ.200 కోట్లతో ఆరు కొత్త టెక్స్ టైల్ పార్కులు.
దేశవ్యాప్తంగా 16 పోర్టుల అభివృద్ధి.
పీపీపీ పద్ధతిలో ఎయిర్ పోర్టుల విస్తరణ, అభివృద్ధి.
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా.
జమ్ముకాశ్మీర్ హస్తకళల అభివృద్ధికి రూ.50 కోట్లు.
బెనారస్ సిల్క్ అభివృద్ధికి రూ.50కోట్లు.
కేంద్రం పరిశీలనలో బ్యాంకులకు మరింత స్వయం ప్రతిపత్తి.
ధరల నియంత్రణకు ఆహార నిల్వలను మార్కెట్లోకి విడుదల చేస్తాం.
ఆరేళ్లలో 50వేల కిలోమీటర్ల మేర గ్యాస్ లైన్ల ఏర్పాటు
ద్రవ్యోల్బణం కట్టడికి ధరల స్థిరీకరణ నిధి.
వ్యవసాయ టెలివిజన్ కు రూ.100 కోట్లు.
జెఎన్ఎన్‌యూఆర్ఎం కింద నగరాల్లో చెత్త, నీరు తొలగింపు.
ఫుట్ సెక్టారులో పీపీపీలను ప్రోత్సహిస్తాం.
సర్వశిక్షా అభియాన్‌కు రూ.28,635 కోట్లు.
సెజ్‌ల పునరుద్ధరణకు సమగ్ర చర్యలు.
నాబార్డు ద్వారా 5 లక్షల మంది భూమిలేని రైతులకు ఆర్థిక సాయం.
జాతీయ బ్యాంకులలో వాటాల అమ్మకం ద్వారా మూలధనం పెంపు.
16 కొత్త నౌకాశ్రయాల అభివృద్ధి.
తగినన్ని ఆహార నిల్వలు ఉన్నాయి.
వాటర్ షెడ్ పథకానికి రూ.2942 కోట్లు.
వ్యవసాయ గోదాంలకు రూ.5వేల కోట్లు.
ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు. ఏపీలో ఐఐటీ, ఎయిమ్స్, తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయం.
రైతుల కోసం కిసాన్ టెలివిజన్
భూసార పరీక్ష కేంద్రానికి రూ.56 కోట్లు.
2019 నాటికి పరిశుభ్ర భారత్.
20 లక్షల జనాభా దాటిన నగరాలను మెట్రో నగరాలుగా అభివృద్ధి.
తక్కువ వడ్డీతో గృహ రుణాలు.
తక్కువ వడ్డీకే రైతులకు షార్ట్ టర్మ్ లోన్లు.
గిరిజనుల కోసం నవబంధు పథకానికి రూ.100 కోట్లు.
నల్లధనం సమస్యకు తప్పక పరిష్కారం కనుగొనాలి.
రూ.100 కోట్లతో ఆరువందల కమ్యూనిటీ రేడియో స్టేషన్లు.
కొత్తగా 5 ఐఐఎంలు, 5 ఐఐటీలు.
ప్రస్తుతం ఉన్న రాయితీల విధానంలో మార్పులు.
అర్హులకే రాయితీలు, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలు కాపాడుతాం.
పట్టణాల్లో రైతు మార్కెట్లు.
సకాలంలో రుణాలు చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ కొనసాగింపు.
గ్రామీణ విద్యుదీకరణకు రూ.500 కోట్లు.
పౌష్టికాహార లేమిని ఎదుర్కొనేందకు సమగ్ర వ్యూహం.
అందరికీ నివాసం కోసం తక్కువ వడ్డీతో గృహ రుణాలు.
2022 నాటికి అందరికీ నివాసం.
వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి నిధితో అసమానతల తొలగింపు.
దళిత, గిరిజన, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు.
మదర్సాల ఆధునికీకరణకు రూ.100 కోట్లు.
దశల వారిగా అన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్
జైట్లీ బడ్జెట్ ప్రసంగం చేస్తూ... ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానానికి చర్యలు తీసుకుంటామన్నారు.
సభ గం.11.50 ని.కు ప్రారంభమైంది. జైట్లీ ఆరోగ్యం బాగోనందున ఆయన కూర్చునే బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తారని స్పీకర్ అన్నారు.
ఆ సమయంలో సభ్యులు నినాదాలు చేశారు. జైట్లీ స్పీకర్ వైపు తిరిగి ఐదు నిమిషాలు తీసుకుందామా అని అడిగారు.
డ్జెట్ ప్రసంగానికి 5 నిమిషాలు విరామం కోరిన జైట్లీ.
రక్షణ రంగంలో ఏఫ్‌డీఐల పైన ప్రభుత్వం నియంత్రణ ఉంటుంది. కరెంట్ ఖాతా లోటుపై నిరంతర పర్యవేక్షణ.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యానికి రూ.500 కోట్లు.
గ్రామాల్లో పాలన మెరుగుకు రూ.100 కోట్లు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి.
పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.50వేల కోట్లు.
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రోజ్ గారి మిషన్ ఏర్పాటు.
మహిళల భద్రతకు రూ.150 కోట్లు.
సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి 6వేల కోట్లు.
వికలాంగులకు సహాయాన్ని పెంచుతాం
అంధుల కోసం బ్రెయిలీ లిపిలో నోట్ల ముద్రణ
గ్రామాల్లో గృహనిర్మాణాలకు రూ.8వేల కోట్లు.
గ్రామీన తాగునీటి సరఫరాకు రూ.3600 కోట్లు.
గ్రామీణ రహదారులకు రూ.14,369 కోట్లు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.28 వేల కోట్లు.
కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ఏర్పాటుకు రూ.100 కోట్లు.
పర్యాటక రంగ ప్రోత్సహానికి 9 ఎయిర్ పోర్టులలో ఈ వీసాలకు అనుమతి.
సురక్షిత మంచి నీటి పథకానికి రూ.3650 కోట్లు.
అరుణ్ జైట్లీ బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి.
మహిళల భద్రతకు రూ.150 కోట్లు. సేవ్ గర్ల్ పథకానికి రూ.100 కోట్లు.
సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణానికి రూ.200 కోట్లు.
సుస్థిరమైన పన్నుల వ్యవస్థ రూపకల్పన
తయారీ, మౌలిక రంగాల అభవృద్ధికి 2.4 లక్షల కోట్లు.
పబ్లిక్ సెక్టార్ పెట్టుబడులలో రెండు లక్షల కోట్ల రూపాయలు.
డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ అర్హులకే అందాలి.
గృహ అవసరాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా.
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రూ.50వేల కోట్లు.
స్కిల్ ఇండియా పేరుతో యువతకు నైపుణ్య శిక్షణ
సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ఆరువేల కోట్లు.
తయారీ రంగానికి మరింత ప్రోత్సాహకం.
2019 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు
గ్రామజ్యోతి పథకానికి రూ.500 కోట్లు
కిసాన్ వికాస పత్రాల ద్వారా పెట్టుబడుల సేకరణ
ప్రధానమంత్రి నీటిపారుదల పథకానికి రూ.1000 కోట్లు.
స్మార్ట్ సిటీల కోసం వ్యయ, యాజమాన్య కమిటీ ఏర్పాటు
ఎంపిక చేసిన రంగాలలో ఎఫ్‌డీఐలకు ప్రోత్సాహం.
దేశంలో వంద స్మార్ట్ సిటీలే లక్ష్యంగా 7,600 కోట్ల రూపాయల కేటాయింపు.
పెట్టుబడులను ప్రోత్సహించేలా పన్నుల విధానాన్ని రూపొందిస్తున్నాం.
త్వరలో కొత్త యూరియా పాలసీ
భివృద్ధి, భవిష్యత్తు తరాల కోసమే బడ్జెట్
అవసరానికి మించి నిధులు ఖర్చు పెట్టలేం
ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముంది
పెట్టుబడులకు స్నేహపూర్వక పన్నుల విధానం
రక్షణ, ఇన్సురెన్స్ రంగంలో ఎఫ్‌డీఐలను 49 శాతానికి పెంచుతాం
100 స్మార్ట్ టౌన్ల ఏర్పాటు
ఆర్థిక వ్యవస్థకు నల్లధనం ప్రమాదకరంగా మారింది.
బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం.
పన్నుల వివాద పరిష్కారానికి ఉన్నతస్థాయి వ్యవస్థ ఏర్పాటు
పేదరిక నిర్మూలన పైన ఎక్కువ దృష్టి పెట్టాలి.
మనం కోరుకునే ఆర్థిక పరిస్థితికి ఈ బడ్జెట్ తొలి అడుగు.
జీడీపీ అభివృద్ధికి కఠిన నిర్ణయాలు తప్పవు.
తయారీ, మౌలిక
ఎరువులు, ఇంధనం సబ్సిడీలపై సమీక్ష.
వచ్చే మూడేళ్లలో మేం సాధించే ప్రగతికి ఈ బడ్జెట్ సూచిక.
4.1 శాతంగా ఉన్న ఆర్థిక లోటు ఆందోళన కలిగించేదే. బడ్జెట్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు.
జీడీపీ అభివృద్ధికి కఠిన నిర్ణయాలు తప్పవు.
2015-2016 నాటికి ఆర్థిక లోటును 3.6 శాతం తగ్గించేందుకు కృషి.
భవిష్యత్తు తరాలకు అప్పులను వారసత్వంగా ఇవ్వకూడదు.
జీఎస్‌టీపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలో దీనికి సంబంధించి సవరణలు చేస్తాం.
ఆదాయాలను పెంచుకునే మార్గాలను త్వరితగతిన అన్వేషించాలి.
రానున్న కాలంలో ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నా. బడ్జెట్‌ను సమగ్రంగా రూపొందించాం.
వర్షాలు ఈ ఏడాది ఆశాజనకంగా లేవు.
రానున్న మూడేళ్లలో ద్రవ్యోల్భణం తగ్గుతుందని భావిస్తున్నాం.
త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే అవకాశాలు కోల్పోతాం.
పేదరికం నుండి బయటపడాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. గత మూడేళ్లుగా ఐదు శాతం వృద్ధి రేటు మించలేదు. 7 నుండి 8 శాతం తమ లక్ష్యం.
అభివృద్ధి, భవిష్యత్తు తరాల కోసం బడ్జెట్ రూపొందించాం. అభివృద్ధి కోసం పేదలు ఎదురు చూస్తున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ పైన అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపాయి. వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముంది.
దేశ ప్రజలు అభివృద్ధి కోసం మార్పు కోరుకున్నారు. రెండేళ్లుగా ద్రవ్యోల్భణం వెంటాడుతోంది.
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
ప్రారంభమైన లోకసభ.
బడ్జెట్ పైన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. బడ్జెట్‌కు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది.
బడ్జెట్ పైన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.
అరుణ్ జైట్లీ పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు.
ఉదయం అరుణ్ జైట్లీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications