తిరుమలలో అరుదైన ఘట్టం: సేవల విషయంలో భక్తులకు గమనిక

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 81,064 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 33,136 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 5.36 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది.

టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.09 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 4.09 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,309 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

Pavitrotsavams From August 23 to 25 at Tirumala Celebrations conducted to remove any inadvertent lapses

కాగా శ్రీవారి ఆలయంలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 22వ తేదిన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

గురువాయురప్పా.. ఒక్కరోజే 377 పెళ్లిళ్లా: ఆ ముహూర్తం మళ్లీ రాదు
గురువాయురప్పా.. ఒక్కరోజే 377 పెళ్లిళ్లా: ఆ ముహూర్తం మళ్లీ రాదు

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. 1962వ సంవత్సరం నుంచి టీటీడీ ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు అర్చకులు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.

ఆ రెండు ఆలయాల్లో టీటీడీ జేఈఓ నిర్వహించిన తనిఖీల్లో..
ఆ రెండు ఆలయాల్లో టీటీడీ జేఈఓ నిర్వహించిన తనిఖీల్లో..

23న పవిత్రాల ప్రతిష్ట, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు. ప‌విత్రోత్స‌వాల అంకురార్ప‌ణ కార‌ణంగా 22న సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. 23 నుండి 25వ తేది వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, 25న అష్టదళ పాదపద్మారాధన సేవ, 26న.. అంటే పవిత్రోత్సవాలు ముగిసిన తర్వాత రోజు కల్యాణోత్సవ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+