వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదల బడ్జెట్-పెట్టుబడులకు ప్రోత్సాహం: మోడీ, నల్లధనం కోసం కొత్త చట్టం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2015-2016 సంవత్సరానికి గాను పార్లమెంటులో శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ భారత అభివృద్ధికి నిచ్చెనలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌కు స్పష్టమైన విజన్‌ ఉందని తెలిపారు. దేశ అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని తెలిపారు. పన్ను విధానం స్పష్టంగా పెట్టుబడుల్ని ఆకర్షించేలా ఉందని తెలిపారు.

పన్నుల విషయంలో అన్ని సందేహాలకు ఈ బడ్జెట్ సమాధానమని చెప్పారు. యువత, రైతులు, మధ్యతరగతి, పేదల అభ్యున్నతికి బడ్జెట్లో సమ ప్రాధాన్యమిచ్చారన్నారు. గృహ, విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాలపై 2022 నాటికి లక్ష్యాల్ని ఏర్పాటు చేసి వాటిని చేరుకునేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు.

Budget 2015 investment friendly, pro-poor: PM Narendra Modi

బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం కల్పించారన్నారు. నల్లధనంపై బడ్జెట్లో ప్రవేశ పెట్టిన అంశాలు తమ ప్రభుత్వ నిబద్ధతకు అద్దం పట్టేవిగా ఉన్నాయని తెలిపారు. నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు కొత్త చట్టం తెస్తామని మోడీ చెప్పారు.

మంచి బడ్జెట్‌ను రూపొందించడంతో అరుణ్‌ జైట్లీ కృతకృత్యులయ్యారని ట్వీట్‌ చేశారు. మనది నిలకడైన పన్నుల వ్యవస్థ అనే నమ్మకాన్ని కలిగించిందని చెప్పారు. అలాగే ప్రకటించిన కొత్త పథకాలు దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలను ఆదుకునేలా రూపొందించాలరని మోడీ హర్షం వ్యక్తం చేశారు.

English summary
Prime Minister Narendra Modi on Saturday described the Union Budget 2015-16 as not just “investment friendly” but also pro-poor, pro-growth, pro-middle class, pro-youth and paradigm shifting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X