వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్ 2018: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురించి మీకేం తెలుసు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Budget 2018 Expectations : ఫిబ్రవరి 1న బడ్జెట్: ఆకాంక్షలు నెరవేరేనా?

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు. ఈ బడ్జెట్‌కు ఓ ప్రత్యేక ఉంది. వచ్చే ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ఇదే అవుతుంది.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో అరుణ్ జైట్లీ ప్రతిపాదించే బడ్జెట్‌కు గతంలో సమర్పించిన బడ్జెట్‌లతో తేడా ఉంటుందని భావిస్తున్నారు. వస్తు సేవా పన్ను (జిఎస్టీ) ద్వారా పూర్తి స్థాయిలో ఇప్పటికే పరోక్ష పన్నులను వేశారు.

Budget 2018: Know your Finance Minister, Arun Jaitley

కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న అరుణ్ జైట్లీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఈ స్థాయికి ఆయన ఎలా చేరుకున్నాడని తెలుసుకోవడానికి పనికి వస్తాయి.

1952 డిసెంబర్ 28వ తేదీన జన్మించిన అరుణ్ జైట్లీ 16వ లోకసభలో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

ఆర్థిక మంత్రిగా పనిచేయడం ఆయనకు ఇదే తొలిసారి. గతంలో ట్రేడ్ మినిస్టర్‌గా, న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. దశాబ్దం క్రితం బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రిగానే కాకుండా కార్పోరేట్ వ్యవహారాల మంత్రిగా, సమాచార ప్రసారాల మంత్రిగా కూడా పనిచేస్తున్నారు.

వ్యవసాయ సబ్సిడీలు తగ్గించకుండా ఎమర్జెంగ్ మార్కెట్ల నుంచి ప్రయోజనం పొందడాన్ని అభివృద్ధి చెందిన దేశాలు అడ్డుకున్న స్థితిలో ట్రేడ్ మినిస్టర్‌గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో చర్చలకు నాయకత్వం వహించారు.

పంజాబీ హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన జైట్లీ 1959-67 మధ్య కాలంలో ఢిల్లీలోని సెయింట్ జేవియర్ స్కూల్లో చదివారు. 1973లో ఎస్ఆర్‌సిసి నుంచి కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి లాలో పట్టా పుచ్చుకున్నారు. వృత్తిరీత్యా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తూ వచ్చారు.

విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి)లో పనిచేశారు. 1974లో ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన బిజెపి జాతయ కార్యవర్గ సభ్యుడు

విపి సింగ్ ప్రభుత్వం ఆయనను 1989లో అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. 19911నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రాజ్యసభ నేతగా అన్నారు.

English summary
The Union Budget for 2018-19 is scheduled to be presented on February 1. It is a significant event because it is the last full budget ahead of the 2019 general election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X