కేంద్రం వరాలు: కార్పోరేట్ పన్ను 2శాతం తగ్గింపు, ఉద్యోగుల ఈపీఎఫ్ వాట ఇలా
Recommended Video

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇందులో ఉద్యోగులకు, కార్పోరేట్ కంపెనీలకు ఊరట లభించింది. కార్పోరేట్ పన్నును 2 శాతానికి తగ్గించారు.
ఉద్యోగుల ఈపీఎఫ్ వాటాలో కేంద్రం వాటాను 8.33గా ఉంటుందని జైట్లీ చెప్పారు. తాము ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో కొత్త ఉద్యోగులకు 12 శాతం ఈపీఎప్ వడ్డీ ఉంటుందని చెప్పారు.

సంప్రదాయానికి భిన్నంగా రెండు భాషల్లో
అరుణ్ జైట్లీ లోకసభలో బడ్జెట్ పెడుతూ గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆయన హిందీలో బడ్జెట్ విషయాలను ప్రసంగిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. గ్రామీణ ప్రజలు, రైతులకు అర్థమయ్యే రీతిలో హిందీలో మాట్లాడుతారని కొన్ని వర్గాలు వెల్లడించాయి. కానీ జైట్లీ మాత్రం అటు పూర్తిగా ఆంగ్లంలో కాకుండా ఇటు పూర్తిగా హిందీలో కాకుండా రెండు భాషల్లో అనర్గళంగా ప్రసంగిస్తున్నారు. సంప్రదాయానికి భిన్నంగా బడ్జెట్‌ను రెండు భాషల్లో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అయిదో బడ్జెట్
జీఎస్టీ అమల్లోకి వచ్చాక ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడం, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జైట్లీ ప్రవేశ పెట్టిన ఐదో బడ్జెట్ ఇది.

పేదలకు వైద్యం విషయంలో భారీ ఊరట
ప్రతి ఏటా వైద్య ఖర్చులు సామాన్యులు భరించలేని స్థాయికి చేరుతుండడంతో కేంద్రం ఈ బడ్జెట్‌లో దీనిపై దృష్టి సారించింది. దేశంలో 50 కోట్ల మంది ప్రజలకు ఇకపై కేంద్రమే వైద్య సాయం అందించనుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జైట్లీ ప్రకటించారు. ఆరోగ్య రక్షణను నూతన ఆకాంక్షల స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

ప్రపంచంలో మరెక్కడా లేదని
ఒక్కో కుటుంబంలో సగటున ఐదుగురు సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే 50 కోట్ల మందికి ప్రభుత్వపరంగా ఆరోగ్య రక్షణ లభించనుంది. ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీని ఓ కుటుంబానికి అందించనున్నట్టు జైట్లీ చెప్పారు. ఆసుపత్రిలో చేరిన వారికి ఈ స్థాయిలో ప్రయోజనం అందించడమన్నది ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు.












Click it and Unblock the Notifications