వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

union budget 2021:బడ్జెట్ అనే పదం ఎలా పుట్టింది? భారత పద్దులో సంచలన మార్పులు తెలుసా?

|
Google Oneindia TeluguNews

గడిచిన ఐదేళ్లుగా వృద్ది రేటు పడిపోతుండటం.. గతేడాది కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థ దాదాపు కుదేలైపోవడం.. తిరిగి దాన్ని గాడిలో పెట్టేందుకు 'ఆత్మనిర్భర్ భారత్' పేరిట చర్యలకు ఉపక్రమించడం.. తదితర పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ 'నెవర్ బిఫోర్'లా, అత్యద్భుతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చారు. నిజంగా ఆమె కలల బడ్జెట్ నే ప్రవేశపెడతారా? లేక నిరాశపరుస్తారా? అన్నది ఇంకొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈలోపు భారత బడ్జెట్ కు సంబంధించి విశేషాలు, గడిచిన కాలంలో చోటుచేసుకున్న కీలక మార్పులేంటో ఓ లుక్కేద్దాం..

తల్లిని చంపి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్నాడు -సగం కాలిన శవంతో దొరికిపోయి..తల్లిని చంపి, ఆమె చితిపై చికెన్ కాల్చుకు తిన్నాడు -సగం కాలిన శవంతో దొరికిపోయి..

బడ్జెట్ ఎలా పుట్టింది?

బడ్జెట్ ఎలా పుట్టింది?

బడ్జెట్ అనే పదం 'బగెట్' అనే ఫ్రెంచ్ పదం నుంచి పుట్టుకొచ్చింది. 'చిన్న సంచి(బ్యాగ్)' అని దాని అర్థం. ఇండియాకు సంబంధించి మొట్టమొదటి బడ్జెట్ ను 1860లో జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. నాటి బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫైనాన్స్ మెంబర్ హోదాలో ఆయన భారత తొలి బడ్జెట్ రూపొందించారు. స్వాతంత్ర్యం తరువాత దేశానికి తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత మాత్రం తమిళనాడు చెట్టిగారికి దక్కింది. 1947, నవంబర్ 26న ఆర్కే షణ్ముఖ చెట్టి తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

 రాజభాషలో తొలి బడ్జెట్..

రాజభాషలో తొలి బడ్జెట్..

బ్రిటిష్ జమానా నుంచి స్వాతంత్ర్యం వచ్చిన చానాళ్లవరకు భారత పార్లమెంటులో బడ్జెట్ ను ఇంగ్లీష్ లోనే చదివేవారు. 1955లోగానీ బడ్జెట్ ను ఇంగ్లీషుతోపాటు జాతీయ భాష హిందీలోనూ చదవడం, ప్రచురించడం మొదలుపెట్టారు. అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘతన మొరార్జీ దేశాయ్ పేరిట ఉండగా, 9సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన పి.చిదంబరం తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక..

సాయంత్రం నుంచి ఉదయానికి..

సాయంత్రం నుంచి ఉదయానికి..

స్వాతంత్రం తర్వాత నుంచి 1999 వరకు కేంద్ర బడ్జెట్ ను ఏటా ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు వెలువరించేవారు. బడ్జెట్ ను ఉదయం 11 గంటలకే ప్రవేశపెట్టే విధానాన్ని అటల్ బీహారీ వాజపేయి హయాంలో తొలిసారి 1999లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తీసుకొచ్చారు. ఇక, 2016 వరకూ వార్షిక్ బడ్జెట్ ను ఫిబ్రవరి చివరి రోజు ప్రవేశపెడుతూరాగా, 2017 నుంచి మాత్రం ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు.

రైల్వే విలీనం.. సుదీర్ఘ రికార్డు..

రైల్వే విలీనం.. సుదీర్ఘ రికార్డు..

2017 వార్షిక బడ్టెట్ లో చోటుచేసుకున్న మరో కీలక మార్పు.. రైల్వే బడ్జెట్ విలీనం. అప్పటిదాకా సాధారణ బడ్జెట్ కు విడిగా రైల్వే బడ్జెట్ ను వెలువరించేవారు. 2017 నుంచి సాధారణంలోనే రైల్వేను విలీనం చేసేశారు. 2014లో అరుణ్ జైట్లీ ఏకంగా 2.50గంటలపాటు సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగం చేశారు. 2020లో నిర్మలా సీతారామన్ 2.30గంటలు ప్రసంగించారు. ఇక..

లక్షీ కటాక్షం కోసం ఎర్రటి వస్త్రంలో..

లక్షీ కటాక్షం కోసం ఎర్రటి వస్త్రంలో..

కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన (1970లో) తొలి మహిళా మంత్రిగా ఇందిరా గాంధీ పేరు రికార్డుల్లో నిలవగా, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతోన్న బ్రీఫ్ కేసు ఆనవాయితీని పక్కన పెడుతూ.. 2020లో నిర్మల.. జాతీయ చిహ్నం ముద్రించిన ఎర్రటి పట్టు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను పార్లమెంటుకు తీసుకువచ్చారు. లక్షీ కటాక్షం కోసం భారతీయ వ్యాపారులు తమ ఖాతా పుస్తకాలను ఎర్రటి వస్త్రంలో ఉంచుతుంటారు. దీన్నే బాహీ ఖాతాగా వ్యవహరిస్తారు. నగదు లావాదేవీల వ్యవహారాలకు దీన్ని శుభకరమైనదిగా భావిస్తారు. అలాగే మత సంబంధిత గ్రంథాలను కూడా ఇలాంటి వస్త్రంలోనే ఉంచుతారని తెలిసిందే.

Recommended Video

Venkatesh On Jet Speed | Narappa And F3 To Hit Screens In 2021

నిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్‌కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీనిమ్మగడ్డపై ప్రివిలేజ్ -జగన్‌కు మరో షాక్ తప్పదు -నోటా ఉండగా ఏకగ్రీవాలేంటి?: వైసీపీ ఎంపీ

English summary
Finance Minister Nirmala Sitharaman is all set to present the first Union Budget of the decade on february 1st. Sitharaman had earlier promised a “never before” like Union Budget as the government looks to steer the pandemic-battered economy and push growth. Indian Budget is the largest budget in the world. The budget is prepared by the concerned department of economic affairs of the Ministry of Finance on an annual basis. Here are some unknown facts about the Union Budget
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X