రైలు ప్రయాణికులకు బడ్జెట్‌లో ఏమిచ్చారు?
Budget 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. అందులో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించారు.
ఈ మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మల సీతారామన్.. గంటలోపే ముగించారు. బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి మెరుపులూ మెరిపించలేదు. గతం కంటే భిన్నంగా సాగిందామె ప్రసంగం. ఇదివరకట్లా ఎలాంటి సూక్తులనూ వినిపించలేదు. హితబోధనలూ చేయలేదు. చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేశారు.

మధ్యంతర, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం వల్లే పెద్దగా భారీ కేటాయింపులు చోటు చేసుకోలేదు. అలాగే పన్నుల వడ్డనలూ లేవు. పన్నుల శ్లాబుల్లోనూ ఎలాంటి మార్పులకూ పూనుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ఎన్నికలు ముగిసిన అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.
Recommended Video

40,000 normal railway bogies will be converted to #VandeBharat standards- Hon'ble FM Smt. @nsitharaman #Budget2024#ViksitBharatBudget pic.twitter.com/BKPk8Xy3aJ
— Ministry of Railways (@RailMinIndia) February 1, 2024
ఈ బడ్జెట్‌లో రైలు ప్రయాణికులపైనా పెద్దగా ఎలాంటి వరాలనూ కురిపించలేదు నిర్మల సీతారామన్. రైలు టికెట్ల తగ్గింపు ప్రస్తావనను తీసుకుని రాలేదు. మౌలిక సదుపాయాలపైనా ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారంతే.
3 major economic railway corridor programs will be implemented under PM Gati Shakti - Hon'ble FM Smt. @nsitharaman#Budget2024#ViksitBharatBudget pic.twitter.com/oH9TeBDpTO
— Ministry of Railways (@RailMinIndia) February 1, 2024
అన్ని రైలు బోగీలన్నింటినీ కూడా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు నిర్మల సీతారామన్. సాధారణ బోగీలన్నీ భవిష్యత్తులో వందే భారత్ తరహాలో సౌకర్యాలను సంతరించుకుంటాయని వెల్లడించారు. దశలవారీగా 40,000 బోగీలను ఆధునికీకరిస్తామని చెప్పారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications