తీపి ఎవరికి..?
Budget 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలపైనే అందరి దృష్టీ నిలిచింది. ఎన్నికలు, ఓటుబ్యాంక్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి తాయిలాలను ప్రకటిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. ఇది- మధ్యంతర బడ్జెట్. మూడు నెలల కాలానికి మాత్రమే సరిపడేలా కేటాయింపులు ఉండొచ్చని అంచనా ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అవసరమైన ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి అవసరమైనంత మేరను కేటాయిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మరోసారి సభ సమావేశమౌతుంది.

బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టబోయే ముందు నిర్మల సీతారామన్.. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూరకంగా కలుసుకున్నారు. ఆ సమయంలో ఆమె వెంట ఆర్థిక శాఖ సహాయ మంత్రులు డాక్టర్ భగవంత్ ఖూబా, పంకజ్ చౌదరి, కొందరు ఉన్నతాధికారులు ఉన్నారు.
వారంతా ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. నిర్మల సీతారామన్, ఆమె టీమ్‌ను అభినందించారు. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన కొన్ని గ్లాన్స్‌ను ఈ సందర్భంగా ఆమెకు అందజేశారు. అందులో పొందుపరిచిన హైలైట్స్ గురించి కూలంకషంగా వివరించారు. ఈ మధ్యంతర బడ్జెట్ ఎలా ఉండబోతోందనేది వివరించారు.
తన అధికారిక నివాసానికి వచ్చిన నిర్మల సీతారామన్‌కు ద్రౌపది ముర్ము స్వయంగా పాయసాన్ని తినిపించారు. బడ్జెట్ కేటాయింపులు, ప్రతిపాదనలు, సంక్షేమానికి మంజూరు చేయాల్సిన నిధులు.. ఇలాగే దేశ ప్రజల నోటిని తీపి చేసేలా ఉండాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. అనంతరం నిర్మల సీతారామన్ అక్కడి నుంచి నేరుగా పార్లమెంట్ భవనానికి బయలుదేరారు.












Click it and Unblock the Notifications