Budget 2024: మధ్యంతర బడ్జెట్‌లో కీలక అంశాలు ఇవే..?!
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే 2024-25 ఆర్థిక బడ్జెట్‌లో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ప్రకటనలు ఏమీ ఉండవని తెలుస్తోంది. అదే సమయంలో బడ్జెట్ ప్రకటించడానికి ముందే ఆర్థిక నిపుణులు పలు అంశాలపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రం కొన్ని అంశాల మీద దృష్టిపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్‌లో కీలకంగా చెబుతోన్న ఆ అంశాలను పరిశీలిస్తే..
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్‌కు..
సాంకేతిక రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఈ బడ్జెట్‌లో పలు అంశాలను జోడించేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు), బ్రాడ్‌బ్యాండ్ వృద్ధిని మరింత ప్రోత్సహించడంపై మరింత దృష్టి సారించి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్‌కు ఎక్కువ నిధులు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుదని సూచిస్తున్నారు.

సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ..
ప్రభుత్వం నుంచి ప్రజలకు అందించే సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపే అవకాశాలు ఉన్నాయని, ఇందులో భాగంగా సంక్షేమ వ్యయాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు అంచనా. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును GDPలో సుమారు 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రామీణ ప్రాంతాలపై..
గ్రామీణ వ్యవసాయాన్ని మంరింత ప్రోత్సహించి, గ్రామీణ ప్రాంతాలను పట్టణ అభివృద్ధితో పోటీపడేలా కాపెక్స్‌పై దృష్టి సారిస్తూనే ప్రభుత్వం పన్నులను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. తద్వారా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు మద్దతునిచ్చే ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రపంచ వృద్ధి ఆందోళనలను అధిగమించడానికి క్యాపెక్స్‌పై ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం..
కేంద్రం అంచనాల ప్రకారం రాబోయే ఆర్థిక సంవత్సరానికి, ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం మనదేశం సుమారు రూ. 4 ట్రిలియన్లు (48 బిలియన్ డాలర్లు) కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కోసం 26.52 బిలియన్ డాలర్ల ఆహార సబ్సిడీ వ్యయాన్ని అంచనా వేయనుంది. ఈ అంచనాలు గత ఆర్ధిక సంవత్సరం కంటే 10 శాతం లేదా 24.11 బిలియన్ డాలర్లు ఎక్కువ.
సొంతింటి కల..
సామాన్యుల సొంత గృహాల కలను నెరవేర్చేందుకు ప్రభుత్వ నిధులు 15 శాతం కంటే ఎక్కువ పెంచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1 ట్రిలియన్ డాలర్లకు (12 బిలియన్ డాలర్లకు సమానం) చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications