కేంద్ర బడ్జెట్ 2025 LIVE: బీహార్‌కు పెద్ద పీట-నిర్మలమ్మ మార్క్ బడ్జెట్..!!
కేంద్ర బడ్జెట్ Live updates 2025-26: ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం శనివారం (2025 ఫిబ్రవరి 1)న ఉదయం 11 గంటలకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మూడవ సారి మోదీ ప్రభుత్వంలో రెండవ సారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లయ్యింది.అంతకుముందు మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
అయితే ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు నిర్మలమ్మ.అదే సమయంలో కొన్ని పన్ను సంస్కరణలు కూడా చేపట్టారు. పాత పన్ను విధానం రద్దు చేసి ఏడాదికి రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి జీరో ఇన్‌కంటాక్స్ విధానం ప్రవేశపెట్టారు.అయితే దీనిపై ఎలాంటి రియల్ ఎస్టేట్ సెక్టార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కేటాయింపులపై కూడా ఆసక్తికర ప్రకటన చేశారు. మొత్తానికి నిర్మలమ్మ బడ్జెట్‌లో ఈ ఏడాది ఎన్నికలకు వెళుతున్న బీహార్ రాష్ట్రంపై కనికరం చూపారనే అభిప్రాయం వినిపిస్తోంది. బడ్జెట్‌కు సంబంధించి మినిట్-టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్‌ను ఫాలో అవ్వండి.














Click it and Unblock the Notifications