Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2026: ఆశలు అడియాశలేనా? సామాన్య రైతుపై బడ్జెట్‌లో వివక్షేనా?

Budget 2026: దేశ ఆర్థిక పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో సాగు ఖర్చులు తగ్గించడమే కాకుండా.. రైతులను లాభదాయకమైన పంటల వైపు మళ్లించేలా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా తీరప్రాంత రైతులు, కొండ ప్రాంతాల్లోని సాగుదారులకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారు.

అధిక ధరలు ఇచ్చే పంటలకు ప్రోత్సాహం
సాధారణ పంట కంటే ఎక్కువ ఆదాయం ఇచ్చే తోట పంటల సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీర ప్రాంతాల్లో కొబ్బరి, శ్రీగంధం, కోకో, జీడిపప్పు వంటి విలువైన పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. కొండ ప్రాంతాల్లో బాదం, అక్రోట్, ఖుమానీ (Apricot) వంటి డ్రై ఫ్రూట్స్ సాగు చేసే రైతులకు కేంద్రం ఆర్థిక సహాయం అందించనుంది. దీని ద్వారా కొబ్బరి ఉత్పత్తిని భారీగా పెంచనున్నారు. ఈ పథకం వల్ల సుమారు 1 కోటి మంది రైతులు, మొత్తంగా 3 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా.

Budget 2026 for Farmers No Hike in PM Kisan Big Push for Coconut Dry Fruits and AI in Farming

పశుపోషణ, మత్స్యకారుల కోసం కొత్త పథకాలు
కేవలం పంటలే కాకుండా పశుపోషణ, చేపల వేటపై ఆధారపడిన కుటుంబాల కోసం ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రకటించింది. పశుపోషణ కోసం రుణాలు తీసుకునే రైతులకు ప్రభుత్వం వడ్డీ రాయితీతో పాటు ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వనుంది. 'క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్' ద్వారా డెయిరీ, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహిస్తారు. 500 జలాశయాలు, అమృత్ సరోవరాలను అభివృద్ధి చేస్తూ మత్స్య సాగును విస్తరిస్తారు. మత్స్యకారులు, మహిళా సంఘాల ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌తో అనుసంధానించేలా ప్లాన్ చేశారు.

సాంకేతికతతో సాగు.. భారత్ విస్తార్ యోజన
వ్యవసాయ రంగంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆధునిక పరిజ్ఞానాన్ని తీసుకురావడానికి 'భారత్ విస్తార్ యోజన'ను ప్రభుత్వం ప్రకటించింది. దీని కింద అన్ని రాష్ట్రాల అగ్రిస్టాక్ పోర్టల్‌లను ఐకార్ (ICAR) ప్యాకేజీతో అనుసంధానిస్తారు. దీనివల్ల రైతులకు వాతావరణ సమాచారం, విత్తనాల నాణ్యత, మార్కెట్ ధరల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది.

ఆ ఆశలపై నీళ్లు: పీఎం కిసాన్‌లో మార్పుల్లేవు
ప్రతి ఏటా బడ్జెట్ అనగానే కోట్లాది మంది రైతులు ఆశగా ఎదురుచూసేది తమకు వచ్చే పెట్టుబడి సాయం పెరుగుతుందనే. అయితే, ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం ఆ విషయంలో మొండిచేయే కనిపించింది. రైతులందరి ప్రధాన డిమాండ్ అయిన పీఎం కిసాన్ సాయం పెంపుపై ఈసారి కూడా ప్రభుత్వం పాత పద్ధతినే అనుసరించింది. ఏడాదికి ఇచ్చే రూ.6,000 మొత్తాన్ని కనీసం రూ. 8,000 లేదా రూ. 10,000 చేస్తారని రైతు సంఘాలు గట్టిగా కోరాయి. కానీ, ప్రభుత్వం ఈ పథకం కింద కేటాయింపులను యథాతథంగా ఉంచింది. సుమారు 11.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకానికి దాదాపు రూ. 63,500 కోట్లు కేటాయించారు. ఇది కేవలం పాత పథకాన్ని కొనసాగించడమే తప్ప కొత్తగా లబ్ధి చేకూర్చే మార్పు ఏదీ లేదు.

బీమా, రుణాల పరిస్థితి
పెరుగుతున్న సాగు ఖర్చులకు అనుగుణంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పరిమితులు పెంచుతారని, అలాగే పీఎం ఫసల్ బీమా యోజనలో ప్రీమియం రాయితీలు ఇస్తారని అంచనా వేసినా, బడ్జెట్ ప్రసంగంలో వీటి ప్రస్తావన నామమాత్రంగానే ఉంది. పాత నిబంధనల ప్రకారమే రుణాల పంపిణీ, బీమా క్లెయిమ్‌లు కొనసాగుతాయి. దీనివల్ల పెరుగుతున్న విత్తనాలు, ఎరువుల ధరల భారం రైతులపైనే పడనుంది.

మొత్తంగా ఈ బడ్జెట్ ద్వారా సంప్రదాయ వ్యవసాయం నుంచి రైతులు 'వాణిజ్య పంటల') వైపు మళ్లేలా ప్రభుత్వం ఊతమిచ్చింది. కొబ్బరి, తోట పంటల సాగుదారులకు ఇది నిజంగా తీపి కబురే!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+