ఎకనామిక్ కారిడార్ ఒక చెత్త.. నిర్మలమ్మ పద్దుపై దీదీ ఫైర్!
Budget 2026: నిర్మలమ్మ ఆదివారం ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్‌పై రాజకీయ దుమారం రేగుతోంది. అధికార పక్షం ఈ బడ్జెట్‌ను 'వికసిత భారత్' దిశగా వేసిన అడుగు అని కొనియాడుతుంటే.. విపక్షాలు మాత్రం ఇది 'దిశానిర్ధేశం లేని పద్దు'అని కొట్టిపారేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై విమర్శల దాడికి దిగారు.
బెంగాల్‌కు మొండిచేయి: మమతా బెనర్జీ
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే మమతా బెనర్జీ స్పందించారు. ఈ పద్దులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. బడ్జెట్ లో ప్రకటించిన ఎకనామిక్ కారిడార్‌ను ఆమె చెత్త అని అభివర్ణించారు. ఈ బడ్జెట్లో బెంగాల్ పట్ల కేంద్రం వివక్ష చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి ప్రయోజనం చేకూరే ప్రకటన కూడా లేదన్నారు. ఇది కేవలం మాటల గారడీ తప్ప మరేమీ కాదని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

తవ్విన కొండ.. పట్టిన ఎలుక: కాంగ్రెస్ విమర్శల వర్షం
కాంగ్రెస్ పార్టీ కూడా బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శించింది. సుఖ్‌దేవ్ భగత్ బడ్జెట్‌ను 'తవ్విన కొండ.. పట్టిన ఎలుక' అని ఎద్దేవా చేశారు. దేశ రక్షణ రంగంఎంతో కీలకమైనది అయినప్పటికీ.. దానిపై ఆర్థిక మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన ఆరోపించారు. కీలక పథకాలకు నిధుల కేటాయింపులపై బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత లేదని జైరామ్ రమేష్ విమర్శించారు. బడ్జెట్ అంకెల గారడీ వల్ల స్టాక్ మార్కెట్ కూడా పడిపోయిందని కాంగ్రెస్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పేర్కొంది.
అదృశ్య వ్యక్తుల కోసమే ఈ బడ్జెట్: అఖిలేష్ యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ఈ బడ్జెట్ కేవలం కొందరు అదృశ్య వ్యక్తులకు (కొందరు పారిశ్రామికవేత్తలు) లాభం చేకూర్చేలా ఉందని ఆరోపించారు. రైతులు, సామాన్యుల సంక్షేమం ఇందులో ఎక్కడా కనిపించడం లేదని, బీజేపీ నుంచి కొత్తగా ఆశించేది ఏమీ లేదని ఆయన అన్నారు. ఇక డింపుల్ యాదవ్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాలకే బీజేపీ ప్రభుత్వం నిధులు ఇస్తుందని, సామాన్యుడికి ఈ బడ్జెట్ అర్థం కాదని ఎద్దేవా చేశారు.
బీజేపీ కౌంటర్
విపక్షాల విమర్శలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పకొట్టారు. "ప్రధాని మోదీ దార్శనికతతో రూపొందించిన ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మారుస్తుంది. సంప్రదాయ రంగాల నుంచి ఆధునిక టెక్నాలజీ వరకు అన్నిటినీ ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుంది" అని అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విపక్షాలు బడ్జెట్ చదవకుండానే విమర్శలు సిద్ధం చేసుకుంటాయని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. బడ్జెట్ 2026 రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ప్రభుత్వం అభివృద్ధి మంత్రం జపిస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రం పేదలు, రైతులు, విపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరించారని ఆరోపిస్తున్నాయి.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications