బడ్జెట్: ఐదు నిమిషాలు ఆర్థిక మంత్రి జైట్లీ విశ్రాంతి
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం మధ్యలో ఐదు నిమిషాలపాటు విశ్రాంతి కోరారు. గతంలో ఎన్నడూ ఏ ఆర్థిక మంత్రి కూడా అలా చేయలేదు. గురువారం ఉదయం ఆయన బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తూ మధ్యలో ఆగి విశ్రాంతి కోరారు.
ఇంతలో ఆకస్మికంగా సభ్యులు కొందరు కేకలు వేయడం ప్రారంభించారు. అది దేనిగురించో ఎవ్వరికీ వినిపించలేదు. ఈలోగా ఆయన స్పీకర్ వైపు తిరిగి ఐదు నిమిషాలపాటు విశ్రాంతి తీసుకుందామా అని అడిగారు. ఆర్థిక మంత్రి సూచనను స్పీకర్ వెంటనే ఆమోదించారు. అప్పుడు సమయం గం.11.45 నిమిషాలు అయ్యింది.

అనంతరం సభ మళ్లీ గం.11.50 నిమిషాలకు సభ ప్రారంభమైంది. ఆర్థిక మంత్రికి ఆరోగ్యం బాగా లేనందున ఆయన కూర్చునే బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తారని స్పీకర్ చెప్పారు. అందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగాన్ని తిరిగి ప్రారంభించారు.
అరుణ్ జైట్లీ ప్రసంగం మధ్యలో ప్రతిపక్షాల సభ్యులు మధ్య మధ్యలో అభ్యంతరం చెబుతూ వెళ్లారు. అయినా ఆయన ప్రసంగం సాఫీగానే సాగింది.












Click it and Unblock the Notifications