జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు...ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్
Recommended Video

మంగళవారంతో లోక్‌సభ సమావేశాలు ముగిశాయి. ఇక ఈ సమావేశాల్లో అత్యంత కీలకమైన రిజర్వేషన్ బిల్లు, నేషనల్ రిజిస్టర్ సిటిజెన్‌షిప్ బిల్లులు లోక్‌సభలో పాస్ అయ్యాయి. ఇక కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ఓటర్లకు తాయిలాలు ప్రకటించే పనిలో పడింది. ఇందుకోసం బడ్జెట్ సమావేశాలు వేదికకానున్నాయి.
శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. ఇక దేశం దృష్టి అంతా బడ్జెట్ సమావేశాలపై పడింది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 13 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో కేంద్రం అన్ని వర్గాలకు వరాలు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, మధ్య తరగతి కుటుంబాలపైనే కేంద్రం ఫోకస్ చేయనున్నట్లు సమాచారం.

సాధారణంగా బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరిరోజున ప్రవేశపెడతారు. ఇది బ్రిటీషు కాలం నుంచి అనాదిగా వస్తున్న ఆచారం. అయితే 2014లో మోడీ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ ట్రెడిషన్‌కు చెక్ పెడుతూ ఇంకాస్త ముందే బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం ప్రారంభించింది. దీనిపై విమర్శలు వచ్చినప్పటికీ అవేమీ పట్టించుకోలేదు మోడీ సర్కార్.












Click it and Unblock the Notifications