హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు: ఆర్థిక రంగానికి చేయూత

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: జపాన్, ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టులు ఇండియన్ రైల్వే ప్రాజెక్టులకు చేయూతనివ్వనుంది.జపాన్‌ దేశం సహకారంతో ఇండియా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులు దేశ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందంచే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు ఇండియాలోని మౌలిక సదుపాయాల కల్పనకు చేయూతను ఇవ్వనుంది. హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీ ఎత్తున మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ తరహ పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం చేసే ప్రాంతాల్లో త్వరితగతిన అభివృద్ది సాధ్యమౌతోంది.

ఈ రకమైన హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం కోసం సిమెంట్, స్టీల్ ముఖ్యం. అయితే ఈ రెండు వస్తువులకు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు పరోక్షంగా వేర్‌హౌజింగ్, రవాణాపై కూడ ప్రభావం చూపనుంది.

 Bullet train: How Mumbai Ahmedabad High-Speed Rail will help the economy grow

ఈ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణంలో కాంక్రీట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. టన్నెల్, బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్‌ల నిర్మాణంలో ఈ కాంక్రీట్ కీలకంగా మారనుంది. 120 లక్షల టన్నుల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అవసరం ఉంటుందని అంచనా.

కాంక్రీట్ నిర్మాణాలకు గాను సుమారు 55 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరమని అంచనా వేస్తున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రతి ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్ అవసరమౌతోంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం కానుంది. ప్రతి ఏటా సుమారు 5 లక్షల టన్నుల స్టీల్ అవసరమని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 20వేల మందికి ఉపాధి లభ్యం కానుంది. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత 4 వేల మందిని ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కింద ఉద్యోగాలు దక్కనున్నాయి.

హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టుల వల్ల పరోక్షంగా 16 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ట్రాక్ నిర్మాణం, సిగ్నలింగ్, కమ్యూనికేషన్, సిగ్నలింగ్ పరికరాలు, పవర్ డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో మెరుగైన నైపుణ్యాన్ని ఉద్యోగులకు అందించనుంది.

హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రజలు అతి త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకొనే అవకాశం ఉంది. విమానాశ్రయాలు, సెంట్రల్ బిజినెస్ జిల్లాలకు త్వరగా ప్రయాణం చేసే వీలుంది. ముంబై-అహ్మాదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు ప్రజలకు సౌకర్యాలను కల్పించనుంది. తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేర్చనుంది.8 గంటల రైలు ప్రయాణ సమయం 2 గంటలకు ఈ ప్రాజెక్టు ద్వారా తగ్గనుంది.

ఈ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ తరాల అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేశారు. అహ్మదాబాద్-ముంబై మార్గంలో ప్రస్తుతం గంటలకు మూడు రైళ్ళను నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రైళ్ళ సంఖ్యను 3 నుండి 8 రైళ్ళకు పెంచనున్నారు.

ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ప్రతి రోజూ సుమారు 40వేల మందిని తమ గమ్యస్థానాకుల చేర్చే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. 2053 నాటికి ప్రతి రోజు సుమారు 1,56వేల మందిని ఈ మార్గంలో తమ గమ్యస్థానాలకు చేరుకొంటారని అంచనా.

బుల్లెట్ ట్రైన్ ప్రారంభ సమయంలో హెచ్ఎస్ఎఆర్ 750 మందిని తరలించే సౌకర్యం ఉంది. అయితే దాన్ని 1250 ప్రయాణీకులను తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నాలుగులైన్ల రహదారిలో గంటకు 4 వేల మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు ద్వారా 16 రైళ్ళు గంటకు నడుస్తాయి.అంటే ఈ లెక్కన ప్రతి గంటలకు 20వేల మంది ప్రయాణం చేసే వీలుంది. జపాన్ ఉపయోగిస్తున్న ఈ భద్రతా ప్రమాణాల కారణంగా ఈ టెక్నాలజీ అత్యంత సురక్షితమైందని తేలింది.

హైస్పీడ్ రైళ్ళ కారణంగా ఇంధనం ఆదా అవుతోంది. విద్యుత్, ఇంధనాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా ఆదా చేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. విమానాల కంటే మూడు రెట్ల కంటే అదనంగా ఇంధనం ఆదా అవుతోంది. కార్ల కంటే ఐదు రెట్లు అదనంగా ఇంధనం ఆదా అవుతోందని అధ్యయనం తెలుపుతోంది.హైస్పీడ్ రైళ్ళ కారణంగా వాతావరణ కాలుష్యం కూడ బాగా తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Japan and India have come together to partner for High-speed rail projects to boost the Indian Railways. While speech safety and technology are a given, the project is expected to also contribute to the economy in many ways.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి