బుర్ద్వాన్ పేలుళ్లు: మరో నిందితుడ్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

కోల్‌కతా: బుర్ద్వాన్ పేలుళ్లకు పాల్పడిన నిందితుడు రెజువల్ కరీమ్‌ను జార్ఖండ్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ముగ్గురు బుర్ద్వాన్ పేలుళ్ల నిందితులను జనవరి 9న కోల్‌కతా కోర్టు ఎన్ఐఏకు ఐదు రోజులపాటు కస్టడీకి ఇచ్చింది. దీంతో ఎన్ఐఏ వారిని విచారించేందుకు కస్టడీకి తీసుకుంది.

బంక్షల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎండి ముంతాజ్ ఖాన్ ఆ ముగ్గురు నిందితులు షహనూర్ ఆలమ్, రెఫిక్వల్ ఇస్లాం, సఫిక్వల్ ఇస్లాంలను జనవరి 13 వరకు ఎన్ఐఏకు కష్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పారు. పేలుళ్లకు పాల్పడిన ఇతర నిందితులు, జిహాదీకి సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు ఎన్ఐఏ పేలుళ్ల నిందితులను కష్టడీకి తీసుకుంది.

Burdwan blast accused Rejaul Karim arrested

ఇప్పటి వరకు 11మంది నిందితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వారిలో ఎక్కువమంది బంగ్లాదేశ్ దేశానికి చెందిన వారున్నారు. అక్టోబర్‌లో బుర్ద్వాన్‌లో పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇద్దరు మృతి చెందారు. ఐఈడి బాంబులను తయారు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది.

బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ జెఎంబికి ఈ పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. కేంద్రం పేలుళ్ల విచారణను ఎన్ఐఏకు అప్పగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+