వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూర్జ్ ఖలిఫాపై మన జెండా మెరిసింది: రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా యువరాజు

|
Google Oneindia TeluguNews

దుబాయ్‌: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని 'బుర్జ్‌ ఖలీఫా' బుధవారం రాత్రి మన జాతీయ పతాకంలోని మూడు రంగులతో కూడిన ఎల్‌ఈడీ దీపాల వెలుగులతో మెరిసిపోయింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏర్పాటు చేసినట్లు బుర్జ్‌ ఖలీఫా నిర్వాహకులు 'ట్విట్టర్‌'లో పేర్కొన్నారు.

రాజ్‌‌పథ్‌లో గణతంత్ర వేడుకలు: అతిథిగా యూఏఈ యువరాజు

Burj Khalifa glows with Tricolour to mark India's Republic Day

దేశ రాజధాని రాజ్‌పథ్‌లో 68వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, త్రివిధ దళాల అధిపతులు తదితరులు హాజరయ్యారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు.

కాగా, గణతంత్ర వేడుకలకు యూఏఈ యువరాజు మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతుకు 179 మంది సభ్యులు గల యూఏఈ సైనికుల బృందం సారథ్యం వహించింది.

గణతంత్ర వేడుకల సందర్భంగా రాజ్‌పథ్‌ వద్ద పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. వేడుకల్లో ప్రముఖులతోపాటు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.

English summary
Burj Khalifa, the world's tallest building, was on Wednesday lit up in tri-colours - saffron, white and green - to celebrate India's 68th Republic Day, showcasing strong cultural and trade bond between India and the UAE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X