వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుర్కాలు, టోపీలు వేసుకుని వస్తే ఆఫీసులోకి నో ఎంట్రీ: బీజేపీ ఎమ్మెల్యే, సహాయం చెయ్యం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బుర్కాలు వేసుకున్న మహిళలను తాన కార్యాలయం పరిసర ప్రాంతాలకు రానివ్వనని, వారికి ఏం సహాయం చేసి పెట్టనని కర్ణాటకలోని విజయపుర నియోజక వర్గం బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం విజయపురలో బీజేపీ ఎమ్మెల్యే ఓ కార్యక్రమంలో మాట్లాడారు. బుర్కాలు వేసుకుని వచ్చే మహిళలకు, టోపీలు పెట్టుకుని వచ్చే వారికి ఎందుకు సహాయం చెయ్యాలని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ప్రశ్నించారు.

బుర్కాలు వేసుకున్న మహిళలు తన కార్యాలయం వైపు చూడకూడదని, తనకు ముస్లీంలు ఎవ్వరూ ఓట్లు వెయ్యలేదని, హిందువులు మాత్రమే ఓట్లు వేశారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Burkha wore women in and around my office says Karnataka BJP MLA

నేనే ఎమ్మెల్యేగా గెలిచింది హిందువులు ఓట్లు వేస్తేనే అని, తనకు ముస్లీంలు ఎవ్వరూ ఓట్లు వెయ్యలేదని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. గడ్డం పోడవుగా పెంచుకుని, తల మీద టోపీలు పెట్టుకుని వచ్చే వాళ్లను తన కార్యాలయంలోకి అనుమతించనని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ స్పష్టం చేశారు.

ముస్లీంలకు ఎవ్వరూ సహాయం చెయ్యకూడదని విజయపుర కార్పొరేటర్లకు బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆదేశాలు జారీ చేశారు. తన కార్యాలయంలోకి హిందువులకు మాత్రమే అనుతి ఉంటుందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలు చేసిన తరువాత కర్ణాటకలో మరో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

English summary
Vijayapur MLA and senior Bjp leader Basanagouda Patil Yatnal has made controversial statement that he would not allow Burkha wore women in and around his office and also said he allows only Hindus who voted to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X