Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జమ్మూ కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ పై మహిళ బాంబు దాడి; 10రోజుల్లో రెండోఘటన

జమ్మూకాశ్మీర్లో సిఆర్పిఎఫ్ బంకర్ వద్ద ఒక మహిళ బాంబు దాడికి పాల్పడింది. జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్ పట్టణంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) క్యాంపుపై బురఖా ధరించిన మహిళ పెట్రోల్ బాంబు విసిరింది. మహిళ బాంబు దాడి మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

సిసి టివి ఫుటేజ్ లో సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో రహదారిలో బురఖా ధరించిన మహిళ బ్యాగ్‌తో రోడ్డు మధ్యలో ఆగింది. బురఖా ధరించిన సదరు మహిళ తన బ్యాగ్ లో ఉన్న బాంబును బయటకి తీసి సీఆర్పీఎఫ్ క్యాంప్ వైపు విసిరి పరారైంది. పీటీఐ నివేదిక ప్రకారం, బురఖా ధరించిన మహిళ సీఆర్పీఎఫ్ క్యాంపు వద్ద భద్రతా సిబ్బందిపై బాంబు విసిరింది. ఈ దాడిలో ఒక పోలీసు, ఒక సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు. వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన సీఆర్పీఎఫ్ జవాన్లు దాడి చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి అన్వేషణ ప్రారంభించారు.

దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు భద్రతా అధికారులు సీసీటీవీ క్లిప్‌లను స్కాన్ చేశారు. దాడి చేసిన వ్యక్తి యొక్క గుర్తింపు నిర్ధారించబడిందని పేర్కొన్నారు. అయితే ఆమెను ఇంకా అదుపులోకి తీసుకోలేదు. దాడి చేసిన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని భద్రతా అధికారులు తెలిపారు. సోపోర్‌లోని సిఆర్‌పిఎఫ్ బంకర్‌పై బాంబు విసిరిన మహిళను గుర్తించామని, ఆమెను త్వరలో అరెస్టు చేస్తామని ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ తెలిపారు. గత 10 రోజుల్లో లోయలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై బాంబు విసరడం ఇది రెండో ఘటన.

burqa woman bomb hurled on CRPF camp in Jammu and Kashmir; Second incident in 10 days

అంతకుముందు మార్చి 19 న, సీఆర్పీఎఫ్ యొక్క బాబాపోరా శిబిరంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఇందులో ఒక జవాన్ గాయపడ్డాడు. ఈ ఘటనలో ఉగ్రవాద నేరాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు శ్రీనగర్లోని రైనా వారి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు ఎన్కౌంటర్ చేశాయి. ఇందులో మాజీ జర్నలిస్ట్ రయీస్ అహ్మద్ భట్ సైతం ఉన్నట్టు కాశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+