రాత్రికి రాత్రే బస్టాండ్ చోరీ.. తెల్లారి చూసి షాకైన స్థానికులు!!

కాదేది చోరీకి అనర్హం అన్నట్టు దేశంలో పరిస్థితి తయారయింది. ఎక్కడ చూసిన చోర శిఖామణులు అందరూ అవాక్కయ్యేలా, ఆసక్తికర దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక చోరీ ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది. ఇంతకు ఆ చోరీ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అసలు దొంగతనం చేసింది ఏంటి? అంటే..

బెంగళూరులోని కన్నింగ్ హామ్ రోడ్లో మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కొత్తగా బస్ స్టాప్ ను నిర్మించింది. దాదాపు 10 లక్షల రూపాయల విలువైన సామాగ్రితో స్పెయిన్ లెస్ స్టీల్ తో, అధునాతన వసతులతో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్టాండ్ ను నిర్మాణం చేసింది. అయితే బస్సు షెల్టర్ నిర్మించిన వారం రోజుల్లోనే దొంగలు దానిని మాయం చేశారు.

 bus stand in Cunningham Road in Bengaluru was stolen overnight

ఒకరోజు రాత్రి సమయంలో అదును చూసి బస్ స్టాప్ ని విడివిడి భాగాలుగా విడగొట్టి ఎత్తుకెళ్లారు. కచ్చితంగా బస్ స్టాప్ ను ఏర్పాటు చేసిన వారం రోజుల వ్యవధిలోనే ఈ షాకింగ్ సంఘటన జరిగింది. బస్సు సెంటర్లో నిర్మాణానికి బాధ్యత వహించే కంపెనీ బెంగళూరు మెట్రోపాలి బస్సు షెల్టర్ అదృశ్యమైన నెల రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంతకు ముందు మార్చిలో hrbr లేఔట్ వద్ద మూడు దశాబ్దాల నాటి బస్టాండ్ రాత్రి సమయంలో అదృశ్యమైంది . కళ్యాణి నగర్ లోని బస్టాండ్ 1990లో లయన్స్ క్లబ్ విరాళంగా ఇస్తే, ఆ బస్టాండ్ కూడా రాత్రి సమయంలో చోరీకి గురైందని, రాత్రికి రాత్రి చోరీ చేసిన వారు బస్టాండ్ ను లేకుండా చేశారని చెబుతున్నారు.

బస్టాండ్ లకు బస్టాండ్ లే కనుమరుగవుతున్న సంఘటనలు ఒక్క బెంగళూరులోనే కాదు, దేశవ్యాప్తంగా అక్కడక్కడ అనేక ప్రాంతాలలో చోటుచేసుకుంటున్నాయి. బస్టాండ్ లనే టార్గెట్ చేసుకుని చోరీకి పాల్పడుతూ, తమకు షెల్టర్ లేకుండా చేస్తున్న వారిని పట్టుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+