పెళ్లాడి మోసగించింది: హీరోయిన్‌పై బిజినెస్‌మాన్
బెంగళూరు: తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన నటి మేఘనా రాజ్.. తనను మోసం చేసిందంటూ ఓ బిజినెస్‌మాన్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు బిజెనెస్‌ాన్ చెన్నైకి చెందిన వారు. ఆయన పేరు జనార్ధన్.
ఆయన కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఈ - మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే, ఎలాంటి సాక్ష్యాధారాలు చూపకపోవడంతో కేసును మూసివేసినట్లు బెంగళూరు దక్షిణ విభాగం డిసిపి వెల్లడించారు.

ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. బెంగళూరుకు చెందిన నటి మేఘనా తనను పెళ్లాడి మోసగించడంతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రవీకరణ పత్రాన్ని కూడా దొంగిలించారంటూ బిజినెస్‌మాన్ కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశారని, పోలీసులు కేనును దర్యాఫ్తు చేశారని చెప్పారు.
అయితే, నటి మేఘనాతో వివాహమైనట్లుగా ఆయన వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేన్నారు. నగరంలో మేఘన నివాసం ఎక్కడ ఉన్నది కూడా చెప్పలేకపోయారని చెప్పారు. దీంతో ఫిర్యాదు దశలోనే కేసును మూసివేసినట్లు చెప్పారు. మరోవైపు మేఘన తల్లి మాట్లాడుతూ.. అసలు అతను ఎవరో కూడా తమకు తెలియదని చెప్పారు. అతని పైన చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతామన్నారు.












Click it and Unblock the Notifications