వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమీ నిర్లక్ష్యం.. ఫోన్ మాట్లాడుకుంటూ వ్యాక్సిన్.. ఒకేసారి రెండు డోసులు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ అందజేసే ప్రక్రియ కొనసాగుతోంది. చాలా చోట్ల వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో నర్స్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కాన్పూర్ జిల్లా దెహత్ వద్ద గల అక్బర్‌పూర్ ఓ నర్స్ మహిళకు వ్యాక్సిన్ అందజేసింది. ఆ సమయంలో నర్స్ ఫోన్ మాట్లాడుతుంది. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోయేది. కానీ అలా లేదు. ఫోన్ మాట్లాడుతూ టీకా ఇచ్చింది. కానీ రెండుసార్లు వ్యాక్సిన్ ఇవ్వడంతో కలకలం రేపింది.

వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అనుమానం కలిగింది. తర్వాత రెండు డోసుల టీకా ఇచ్చావా అడుగగా.. ఆమె క్షమాపణ చెప్పాలి.. కానీ తన అధికార దర్పంతో మందలించిందని పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. శనివారం రోజున జరిగిన ఘటన సంచలనం కలిగించింది. కమలేశ్ కుమారి అనే మహిళకు ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ అందజేశారు. శనివారం ఒక డోసు కాగా.. మరోసారి మిగతా డోసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదే రోజు ఇవ్వడం వల్ల ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వ్యాక్సిన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి.

Busy on phone call, UP nurse gives woman 2 doses of Covid-19 vaccine

వ్యాక్సిన్ తీసుకున్న మహిళ చేతికి వాచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటివరకు సీరియస్‌గా ఎలాంటి లక్షణాలు కనిపించలేదని చెప్పారు. ఈ ఘటనపై డీఎం విచారణకు ఆదేశించారు.

English summary
woman in Uttar Pradesh's Kanpur Dehat district was given two doses of a Covid-19 vaccine at a government centre as the nurse attending her was busy on a phone call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X