వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికలు: నరేంద్ర మోడీ హవాకు మరో పరీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో జరిగిన ఉప ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీకి పరీక్షగా భావిస్తున్నారు. దేశంలోని మూడు లోకసభ స్థానాలకు, 33 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పోలింగ్ దాదాపు ప్రశాంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ శాసనసభా స్థానం పోలింగ్ శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోకసభ స్థానం పోలింగ్‌లో కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటలూ చోటు చేసుకోలేదు.

ఉప ఎన్నికలు పది రాష్ట్ర్లాల్లో జరిగాయి. ఫలితాలు ఈ నెల 16వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం వచ్చే హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలపై ఉండవచ్చునని అంటున్నారు. ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిఫలిస్తాయని కూడా అంటున్నారు.

Bypolls

ఇటీవల జరిగిన బీహార్, ఉత్తరాఖండ్ ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి చేదునే అందించాయి. కాంగ్రెసుకు కొద్ది పాటి సీట్లు వచ్చినా ఆ పార్టీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నైతిక స్థయిర్యం పెరుగుతుందని భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 11 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో మెజారిటీ స్థానాలను బిజెపి గెలుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే, దాని ప్రభావం మోడీ కేంద్ర ప్రభుత్వంపై పడుతుందని అంటున్నారు. అలాగే, మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో 9 లోకసభ స్థానాలకు, వడదొర పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాల ప్రభావం కూడా మోడీ ప్రభుత్వంపై ఉంటుంది.

English summary
As voting underway for 3 Lok Sabha and 33 assembly seats across 10 States, parties must be weary about their future prospect. This stem from the fact that the result will set the pitch for coming Assembly election in two States Haryana and Maharashtra. The Election Commission on Friday had announced the two States will go for the polling on October 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X