Super CM: తండ్రి సీఎం, కొడుకు సూపర్ సీఎం, ఏడాదిలో రూ. 5, 000 కోట్లు లూటీ ?, సాక్షం, లక్ష్మణ్ !
బెంగళూరు/ మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5, 000 కోట్లకు పైగా ప్రజల డబ్బులు లూటీ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి ముఖ్యమంత్రి అనే ధీమాతో కేవలం ఒక్క సంవత్సరంలో బీవై. విజయేంద్ర రూ. 5 వేల కోట్లకు పైగా లూటీ చేశారని, వాటికి సంబంధించన ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ ఢిల్లీలో విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కొడుకు పెద్ద మొత్తంలో లూటీ చేసిన స్కామ్ కు సంబంధించి కొందరు ఎమ్మెల్యేల సంతకాలు చేసిన పత్రాలు మా దగ్గర ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ ఆరోపణలు చెయ్యడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.

తండ్రి సీఎం.... కొడుకు సూపర్ సీఎం
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర వైఖరితో బీజేపీ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ్ ఆరోపించారు. కర్ణాటకకు బీఎస్. యడియూరప్ప సీఎం అయితే ఆయన కొడుకు బీవై. విజయేంద్ర మా పాలిట సూపర్ సీఎం అయ్యారని బీజేపీ నాయకులు వాపోతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ్ ఆరోపించారు. మైసూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్యేలు రాసిన లెటర్ ఇదే
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర వైఖరిపై విసిగిపోయిన బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులకు ఓ లేఖ రాశారని, అందులో వారు సంతకాలు చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలు రాసిన లేఖ ఇదే అంటూ వాటి జిరాక్స్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ్ మీడియాకు విడుదల చేశారు.

ఒక్క సంవత్సరంలో రూ. 5 వేల కోట్లు లూటీ ?
తన తండ్రి ముఖ్యమంత్రి అనే ధీమాతో కేవలం ఒక్క సంవత్సరంలో బీవై. విజయేంద్ర రూ. 5 వేల కోట్లకు పైగా లూటీ చేశారని, వాటికి సంబంధించన ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ సెప్టెంబర్ రెండో వారం లేదా మూడో వారంలో ఢిల్లీలో విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు.

విజయేంద్ర బ్యాచ్ లో 32 మంది
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర 32 మందిని ఒక గ్రూప్ గా తయారు చేసుకుని పరోక్షంగా కర్ణాటక ప్రభుత్వాన్ని శాసిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. సీఎం కొడుకు విజయేంద్ర తీరుపై విసిగిపోయిన 7 మంది బీజేపీ ఎమ్మెల్యేలే బీజేపీ హైకమాండ్ కు ఓ లేఖ రాశారని ,అందులో వారి సంతకాలు చేశారని ఎం. లక్ష్మణ్ ఆరోపించారు. జరిగిన తప్పు సరిదిద్దుకోవడానికి బీజేపీకి 10 రోజులు అవకాశం ఇస్తున్నామని, ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించడానికి బీజేపీ నాయకులు సిద్దం కావాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
-
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications