వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్‌కు షాక్: ఒకచోట బిజెపి గెలుపు, మరోచోట కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. యుపిలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలోని అతి కీలకమైన ప్రాంతంలో ఇటీవల ఉప ఎన్నికల నిర్వహించారు.

ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగాయి. ఇందులో బిజెపి విజయం సాధించింది. అయితే 2017లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంది.

2017లో ఉత్తర ప్రదేశ్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమాజ్ వాది పార్టీకి ముజఫర్ నగర్‌లో ఎదురు దెబ్బ తగలడం గమనార్హం. అదే సమయంలో డియోబాండ్ సీటును కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.

Bypoll results 2016: BJP wins by 6000 votes in Muzaffarnagar, Congress takes Deoband seat

మరోవైపు ఈ ప్రాంతంలో గెలుపు సంబరాలపై నిషేధం విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నిఖిల్‌ చంద్‌ చతుర్వేది వెల్లడించారు. సంబరాలు, టపాసులు పేల్చడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మహారాష్ట్ర, కర్నాటక, బీహార్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలలోని పలుచోట్ల ఫిబ్రవరి 13వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ రోజు జరిగింది.

యూపీలోని ముజఫర్ నగర్లో బిజెపి అభ్యర్థి, బీహార్లోని హార్లఖిలో ఎన్డీయే అభ్యర్థి, యూపిలోని డియోబాండులో కాంగ్రెస్ అభ్యర్థి, మహారాష్ట్రలోని పాల్ ఘర్‌లో శఇవసేన అభ్యర్థి, పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్‌లో అకాళీదళ్ అభ్యర్థి గెలుపొందారు.

English summary
The BJP has defeated the ruling Samajwadi Party in Assembly bypoll in riot-hit Muzaffarnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X