వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంలో మోడీ ప్రభుత్వమే!: ఏ సర్వే ఏం చెప్పింది?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని, మోడీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్ పోల్ సర్వేలు ఢంకా బజాయిస్తున్నాయి. ప్రీపోల్ సర్వేల్లో, ఎగ్జిట్ పోల్ సర్వేల్లో మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. పలు జాతీయ సర్వేలు యూపిలో బిజెపి వికసిస్తోందని చెబుతున్నాయి.

ఏ సర్వే ఏం చెబుతోంది?

ఇండియా టీవి సర్వే ప్రకారం ఎన్డీయేకి 289, యూపిఏకు 101, ఆజ్ తక్ సర్వే ప్రకారం ఎన్డీయేకి 272, యూపిఏకు 115, ఎబిపి సర్వే ప్రకారం ఎన్డీయేకి 281, యూపిఏకు 97, టుడేస్ చాణక్య సర్వే ప్రకారం ఎన్డీయేకి 340, యూపిఏకు 70, టైమ్స్ నో సర్వే ప్రకారం ఎన్డీయేకి 249, యూపిఏకు 148, సిఎన్ఎన్-ఐబిఎన్ సర్వే ప్రకారం ఎన్డీయేకి 282, యూపిఏకు 102, హెడ్‌లైన్స్ సర్వే ప్రకారం ఎన్డీయేకి 272, యూపిఏకు 115, సి ఓటరు సర్వే ప్రకారం ఎన్డీయేకి 289, యూపిఏకు 101 వస్తాయని అంచనా.

C-Voter Exit Poll survey: NDA may get 289 seats, UPA 101 seats

ఢిల్లీ పీఠం ఎక్కేందుకు కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లోని 80 స్థానాలలో బిజెపి 40 నుండి 50కి పైగా స్థానాలను గెలుచుకుంటోంది. బీహార్‌లోను బిజపి హవా కనిపిస్తోంది. ఢిల్లీలో ఏడు స్థానాల్లో 5 నుండి 7 వరకు బిజెపి గెలుచుకుంటుంది. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బిజెపి హవా ఉంది.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మాత్రం స్థానిక పార్టీల హవా కొనసాగనుంది. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకె, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీలు అత్యధిక స్థానాలను గెలుచుకోనున్నాయి. కాంగ్రెసు పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం చూపనుంది.

English summary

 As the 16th Lok Sabha elections 2014 came to an end on Monday, C-Voter conducted a post-poll survey clearly indicating that NDA will win 289 parliamentary seats, besides grabbing all Delhi seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X