Bengal post-poll violence case -సీబీఐ, సిట్ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు ఆదేశం -సుప్రీంకు వెళ్లనున్న మమత!
పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి మూడు నెలలు పూర్తయినా రాజకీయ వివాదాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. శక్తిమంతమైన ద్వయం మోదీ-షా నేతృత్వంలోని బీజేపీని ఢీకొడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మూడోసారి విజయం సాధించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భారీ హింస చెలరేగింది. నాటి ఘటనలపై కోర్టుల విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది..
Recommended Video
బెంగాల్ లో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసకు సంబంధించిన కేసులపై కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హింసాత్మక ఘటనలపై పిటిషనర్లు, మమత సర్కారు భిన్నవాదనలు వినిపిస్తున్న క్రమంలో, సదరు ఘటనలపై కేంద్ర సంస్థ సీబీఐతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు నిర్ణచించింది. బెంగాల్ పోస్ట్ పోల్స్ వాయలెన్స్ కేసుల విచారణను సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు,

ఎన్నికల అనంతర హింసపై సీబీఐ దర్యాప్తుతోపాటు కోర్టు ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కూడా సమాంతర విచారణ జరుపుతుందని హైకోర్టు తెలిపింది. ఎన్నికల అనంతర హింసపై దాఖలైన పిటిషన్లను కలకత్తా హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది.
ఏడాది మే 2న తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తీవ్ర హింస చెలరేగింది. దీనిపై ఎంతో మంది పిటిషనర్లు హైకోర్టు గడప తొక్కారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఓ కమిటీ ఏర్పాటు చేసి దీనిపై విచారణ జరిపింది. జులై 15న దీనికి సంబంధించిన తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. అధికార పార్టీ మద్దతుదారులు ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులపై జరిపిన ప్రతీకార హింసగా దీనిని కమిటీ అభివర్ణించింది. హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని, అంతేకాదు ఈ విచారణ రాష్ట్రం బయట జరగాలని కూడా స్పష్టం చేసింది. కాగా,
హింసకు సంబంధించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీజేపీ నేతలు చేస్తోన్న న్యాయపోరాటం సీఎం మమతకు ఇరకాటంగా మారింది. కేసుల దర్యాప్తును సీబీఐకి, కోర్టు ఆధ్వర్యంలోని సిట్ కు అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా టీఎంసీ సర్కారు యోచన చేస్తున్నది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications