బర్త్‌డేకి పిలిచి యువతిపై గ్యాంగ్‌రేప్: అమ్మేశారు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఓ యువతిని పుట్టినరోజంటూ పిలిచిన దుర్మార్గులు.. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను వ్యభిచారం గృహానికి అమ్మేశారు. ఈ దారుణ ఘటన నలంద జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నలంద జిల్లాకు చెందిన ఓ యువతిని స్నేహితులు పుట్టినరోజు వేడుకలకు రమ్మని ఆహ్వానించారు. వేడుకకు వెళ్లిన ఆమెపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతరం ఓ వ్యభిచార గృహానికి ఆమెను అమ్మేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. యువతిని రక్షించి, వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications