అయిదో విడత ఎన్నికల హైలైట్స్..!

5th Phase Lok Sabha elections 2024 : దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీన అయిదో విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటివరకు నాలుగు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది.

ఇక అయిదో విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ దశలో ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్‌సభ స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్- 14, మహారాష్ట్ర- 13, పశ్చిమ బెంగాల్-7, బిహార్- 5, ఒడిశా- 5, జార్ఖండ్‌- 3, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్- 1, లఢక్‌- 1 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.

Campaign came to end today for 5th phase Lok Sabha elections 2024

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రెండు హైఓల్టేజ్ సీట్లు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాయ్‌బరేలీ- రాహుల్ గాంధీ, అమేథీ- స్మృతి ఇరానీ, లక్నో- రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు.

కేరళలోని వాయనాడ్ నుంచి కూడా రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. రెండో విడతలోనే ఇక్కడ పోలింగ్ పూర్తయింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు రాహుల్ గాంధీ.. రాయ్‌బరేలీ నుంచి కూడా ఎన్నికల్లో పోటీకి నిలిచారు. నామినేషన్ దాఖలు చేశారు.

ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఏఐసీసీ మాజీ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సోనియా గాంధీ ఖాళీ చేసిన స్థానం కావడం వల్ల ఆమె కుటుంబమే ఇక్కడి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ భావించింది. రాహుల్ గాంధీని బరిలో దింపింది.

ఆయా లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రం తెరపడనుంది. దీనితో అన్ని పార్టీలు కూడా తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచాయి. బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తించనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తొలిసారిగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+