అపైర్ చెడితే రేప్ చేశారంటారా?: సుప్రీం కోర్టు ప్రశ్న

న్యూఢిల్లీ: పురుషుల మీద ఉన్న పగ తీర్చుకునేందుకు, బలవంతంగా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అత్యాచారం కేసులను ఓ ఆయుధంగా మహిళలు ఉపయోగించుకుంటున్నారని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారికి, ఓ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఉద్యోగికి మధ్య ఉన్న సంబంధం చెడిపోయిన కేసులో సుప్రీం కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది.

ఇద్దరి సమ్మతితో నడిచే సంబంధం దెబ్బ తిన్నప్పుడు పురుషులపై మహిళలు అత్యాచారం ఆరోపణలు చేస్తున్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో సంబంధం పెట్టుకున్నాడని, తాము సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇటర్నెట్‌లో పెడతానని బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంటూ గత ఏడాది ఢిల్లీ హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది.

Can failed affair lead to rape charges? Supreme Court asks

దీంతో ఢిల్లీ హైకోర్టు ఈ కేసును సుప్రీంకోర్టుకు సిఫార్సు చేస్తూ, పురుషుల మీద పగ తీర్చుకునేందుకు, బలవంతంగా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అత్యాచారం కేసులను ఓ ఆయుధంలా ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ జిత్ సేన్, జస్టిస్ ఎస్‌కే సింగ్‌లతో కూడిన ధర్మాసనం బాధితురాలిపై ప్రశ్నల వర్షం కురిపించింది.

అలాంటి అసభ్య ఫోటో ఎందుకు తీయనిచ్చారని అడిగింది. సెల్ఫీ అయితే మొత్తం శరీరాన్ని ఫోటో తీయడం సాధ్యమేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రెండేళ్లపాటు బంధం కొనసాగించి, అది చెడిపోయిన తరువాత అత్యాచారం అని ఎలా అంటారని నిలదీసింది. పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ మధ్య సంబంధం చెడిపోతే అత్యాచారం ఆరోపణలు చేసుకుంటారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+