నెహ్రూను మర్చిపోలేకపోతున్న మోడీ ? 100వ స్పీచ్ లో 14 సార్లు ప్రస్తావన..!

ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు దాటిపోయింది. పార్లమెంట్ లో ఎన్నో ప్రసంగాలు చేశారు. తాజాగా తన 100వ ప్రసంగం కూడా పూర్తి చేసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి లోక్ సభలో జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఓ అరుదైన రికార్డు సాధించారు. తన 100వ ప్రసంగంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరును ఏకంగా 14 సార్లు తల్చుకున్నారు.

తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పిదాల కారణంగానే భారత దేశం ఇలా ఉందని, కాశ్మీర్ అలా అయిపోయిందని, సరిహద్దులు తీవ్రవాద స్థావరాలుగా మారిపోయాయని, అసలు దేశంలోనే అన్ని సమస్యలకూ ఆయనే కారణం అన్నట్లుగా ప్రధాని మోడీ ప్రసంగాలు సాగిపోతున్నాయి. ఈసారి కూడా ఆపరేషన్ సింధూర్ కూ, జవహర్ లాల్ నెహ్రూకు ఎలాంటి సంబంధం లేకపోయినా ప్రధాని మోడీ మాత్రం తన ప్రసంగంలో ప్రతీ ఏడు నిమిషాలకోసారి ఆయన పేరును తల్చుకున్నారు.

Can t pm Modi forgetting Jawaharlal nehru still mentioned 14 times in 100th speech

కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టే క్రమంలో ప్రధాని మోడీ ఇలా భారత తొలి ప్రధాని, ఎన్నో సంస్కరణలకు, పంచవర్ష ప్రణాళికలకూ ఆద్యుడైన నవ భారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూను టార్గెట్ చేస్తూ పదే పదే ఆయన ప్రస్తావన తీసుకురావడంపై సొంత పార్టీ బీజేపీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. విపక్షాలు అయితే ప్రధాని మోడీ ఇలా మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిర పేర్లను ప్రస్తావిస్తూ చేస్తున్న విమర్శలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Can t pm Modi forgetting Jawaharlal nehru still mentioned 14 times in 100th speech

ఎప్పుడో 60 ఏళ్ల క్రితం చనిపోయిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రస్తావనను ఇన్నిసార్లు తన ప్రసంగంలో తీసుకురావడం ద్వారా ప్రధాని మోడీ ఏం చెప్పదల్చుకున్నారంటూ దేశంలో సీనియర్ జర్నలిస్టులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయి కూడా ప్రధాని మోడీ ఇలా తన 100వ ప్రసంగంలో నెహ్రూ పేరును ఇన్నిసార్లు తల్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన గతాన్ని వదిలేసి వర్తమానం, భవిష్యత్తుపై దృష్టిసారించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+