వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్ సీఎస్ సంచలనం: కారు డోర్ వల్లే మమతకు గాయం, ఈసీకి రిపోర్ట్..

|
Google Oneindia TeluguNews

నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ కాలుకు అయిన గాయం సర్వత్రా చర్చకు దారితీసింది. కొందరు తనపై దాడి చేశారని మమతా ఆరోపించగా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం అదేం లేదని చెప్పారు. కారు డోర్ తగిలి గాయం అయ్యిందని వివరించారు. వారు చెప్పినట్టే బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక కూడా అందజేశారు.

 Car door caused injury to Mamata Banerjee’s leg: Bengal cs

ఈసీకి బెంగాల్ సీఎస్ అలపన్ భండోపాధ్యాయ్ రిపోర్ట్ అందజేశారు. దానిని ఈసీ సభ్యులు చదివి.. డిస్కష్ చేసుకున్నారు. కారు డోర్ వల్ల కాలుకి గాయం జరిగిందని.. అయితే అలా జరగానికి కారణం ఏంటో తెలియలేదు. ఆ డోర్ ఎవరూ వేశారనే అంశంపై స్పష్టత లేదు అని టీఎంసీ అంటోంది. అందువల్లే ఆమె కాలుకి గాయం జరిగినట్టు ఉంటుందని వారు ఇప్పటికీ చెబుతున్నారు.

ఈ నెల 10వ తేదీన మమత కాలికి గాయం జరిగిన సమయంలో చాలా మంది గుమిగూడి ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు. కరెంట్ స్తంభం మమతా ఉన్న వాహనానికి చాలా దూరంలో లేదని వివరించారు. అందువల్లే కారు డోర్ తీసేప్పుడు పోల్ ఉందని.. తీసే క్రమంలో గాయం జరిగి ఉండొచ్చనే అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీ ప్రతినిధుల బృందం ఈసీని కలిశారు. వీడియో అందజేశామని.. అదీ ప్రజలకు చూపించాలని కోరామని వివరించారు. నందిగ్రామ్, ఇతర నియోజకవర్గాలు సున్నితమైనవని.. అందుకే జాగ్రత్తగా ఉండాలని కోరారు. మరోవైపు రెండురోజులు ఆస్పత్రిలో ఉన్న మమతా బెనర్జీ డిశ్చార్జ్ అయ్యారు.

English summary
Injury to CM Mamata Banerjee's leg in Nandigram was caused due to the car door, West Bengal Chief Secretary said in his report to the Election Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X