కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరు మంది దుర్మరణం, ఒకే ఫ్యామిలీలో నలుగురి మృతి, విషాదం !

దీపావళికి సొంత గ్రామానికి వెలుతున్న కుటుంబ సభ్యులువేగంగా వెనుక నుంచి బైక్ ను ఢీకొన్న స్కార్పియో కారు, ఆరు మంది దుర్మరణంఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు, విహారయాత్రకు వెలుతున్న ఇద్దరు యువకులు మృతి

బెంగళూరు: వేగంగా కారు నడిపి ముందు వెలుతున్న బైక్ ను ఢీకొనడంతో ఆరు మంది దుర్మరణం చెందిన ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా లక్కనహళ్ళి సమీపంలో జరిగింది. తుమకూరు జిల్లా జడేమాయసంద్ర గ్రామానికి చెందిన కెంపరాజు (38), ఆయన భార్య మమత(30), కుమార్తె సౌమ్య (10), కుమారుడు సంజయ్ (2), బెంగళూరులోని నాగవారలో నివాసం ఉంటున్న సాజన్ (24), నవీద్ (25) అనే ఆరు మంది దుర్మరణం చెందారు.

Car rammed into a bus shelter in ramanagara kills six people in Karnataka

బెంగళూరులో నివాసం ఉంటున్న కెంపరాజు కుటుంబ సభ్యులతో కలిసి బైక్ లో తన స్వగ్రామానికి బయలుదేరాడు. బెంగళూరులోని హోరమావు సమీపంలోని హెచ్ కేబీకే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న సాజన్, నవీద్ తో పాటు ఆరు మంది స్కార్పియో కారులో విహారయాత్రకు బయలుదేరారు.

Car rammed into a bus shelter in ramanagara kills six people in Karnataka

బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిలోని లక్కేనహళ్ళి సమీపంలోని సావకారపాళ్య బస్ స్టాప్ దగ్గర వేగంగా వెలుతున్న స్కార్పియో కారు ముందు వెలుతున్న కెంపరాజు బైక్ ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో బైక్ లో వెలుతున్న ఒకే కుటుంబలోని నలుగురు దుర్మరణం చెందారు.

కారు అదుపు తప్పి రోడ్డు పక్కన సావకారపాళ్య బస్ షెల్టర్ ను డీకొని పొలంలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న సాజన్, నవీద్ దుర్మరణం చెందారు. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్రగాయాలైనాయి. ఈ ప్రమాదంలో స్కార్పియో కారు నుజ్జు నుజ్చు అయ్యింది.

Car rammed into a bus shelter in ramanagara kills six people in Karnataka

విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరుగురి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+