తిరుగుబాటు లెవ‌నెత్తిన ఎమ్మెల్యే ఇంటికి కుమార‌స్వామి

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌కుల్లో ఒక‌రైన రామ‌లింగా రెడ్డి ఇంటికి ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి వెళ్లారు. గురువారం ఉద‌యం బెంగ‌ళూరు ల‌క్క‌సంద్ర‌లోని రామలింగా రెడ్డికి వెళ్లిన ఆయ‌న అక్క‌డే అల్పాహారం తీసుకున్నారు. బెంగ‌ళూరులోని బీటీఎం లేఅవుట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో మొద‌ట‌గా తిరుగుబాటును తీసుకొచ్చింది రామ‌లింగా రెడ్డే. ఇదివ‌ర‌కు సిద్ధ‌రామ‌య్య ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేశారు. కుమార‌స్వామి విధానాలు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం మ‌న‌సు మార్చుకున్నారు. రాజీనామాను ఉప‌సంహ‌రించుకున్నారు. అప్ప‌టికే- జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. తిరుగుబాటు రాజుకుంది. చివ‌రి నిమిషంలో రామ‌లింగా రెడ్డి వెన‌క్కి త‌గ్గిన‌ప్ప‌టికీ.. మిగిలిన వారు త‌మ రాజీనామాల‌ను వెన‌క్కి తీసుకోవడానికి మొరాయించారు.

caretaker Karnataka CM Kumaraswamy met Congress leader Ramalinga Reddy at his residence

సుమారు 40 నిమిషాల పాటు కుమార‌స్వామి ఆయ‌న నివాసంలో గ‌డిపారు. ఆ స‌మ‌యంలో రామ‌లింగా రెడ్డి కుమార్తె జ‌య‌న‌గ‌ర ఎమ్మెల్యే సౌమ్యా రెడ్డి అక్క‌డే ఉన్నారు. అనంత‌రం వారు విలేక‌రుల‌తో మాట్లాడారు. తన రాక‌కు ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త లేద‌ని కుమార‌స్వామి చెప్పారు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు వ‌స్తాయా? అంటూ విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను దాట‌వేశారు. ఏ విషయాన్నైనా ఇప్పుడే చెప్ప‌డం స‌రికాద‌ని కుమార‌స్వామి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+