Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో ఘోరం.. విమానాన్ని ఢీ కొట్టిన కార్గో ట్రక్..

ముంబై ఎయిర్ పోర్టులో షాకింగ్ ఘటన జరిగింది. విమానాశ్రయంలో పార్కింగ్ చేసి ఉన్న ఆకాశ ఎయిర్ లైన్స్ విమానాన్ని సరుకులను తరలించే ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు ఢీ కొట్టింది. వెంటనే అక్కడకు చేరుకున్న ఎయిర్ పోర్టు సిబ్బంది.. విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. దెబ్బ తిన్న భాగానికి మరమ్మతులు చేపట్టారు. ఆ ట్రక్కును విమాన సిబ్బంది కాకుండా ఓ థర్డ్ పార్టీ వ్యక్తి నడిపినట్లు గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఇటీవల దేశవ్యాప్తంగా విమాన ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయి. నిత్యం సాంకేతిక సమస్యలతో విమానాలు ఎక్కడపడితే అక్కడ ల్యాండింగ్ అవుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతిచెందారు. ఇటీవలి కాలంలో అనేక విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

ముంబై ఎయిర్ పోర్టులో పార్కింగ్ చేసి ఉన్న ఆకాశ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని ఓ కార్గో ట్రక్కు ఢీ కొట్టింది. ట్రక్కు బలంగా ఢీ కొట్టడంతో విమానం రెక్క కొంత భాగం ట్రక్కులోకి దూరింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేపట్టారు.

Cargo Truck Collides with Parked Akasa Air Plane at Mumbai Airport

అయితే ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. దెబ్బ తిన్న భాగానికి మరమ్మతులు చేపట్టారు. ఆ ట్రక్కును విమాన సిబ్బంది కాకుండా ఓ థర్డ్ పార్టీ వ్యక్తి నడిపినట్లు గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఆకాశ ఎయిర్ లైన్స్ విమానం QP1410 ఎయిర్ పోర్ట్ లోని బే-7 లైన్ వద్ద పార్కింగ్ చేసి ఉంది. ఆ విమానం ముంబై నుంచి దిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే జులై 14న ఉదయం 7 గంటల సమయంలో ఓ కార్గో ట్రక్ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో విమానం ఓ రెక్క దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇదే విమానం QP1736 బెంగళూరు నుంచి ముంబై ప్రయాణం చేసి రావడంతో పార్కింగ్ స్థలంలో నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఘటన జరిగింది. ఆ ట్రక్కును విమాన సిబ్బంది కాకుండా ఓ థర్డ్ పార్టీ వ్యక్తి నడిపినట్లు గుర్తించారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+