భారతరత్న అవార్డు: టెండూల్కర్, మన్మోహన్‌లపై కేసు
ముజఫర్‌పూర్ (బీహార్): దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ స్థానిక కోర్టులో మంగళవారం కోర్టులో కేసు వేశారు. ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని ఆరోపిస్తూ ప్రధని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఆరోపణలు చేశారు. వివిధ సెక్షన్ల కింద సచిన్ టెండూల్కర్‌ను అందులో నిందితుడిగా పేర్కొన్నారు.
స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్పీ సింగ్ ముందు కేసును దాఖలు చేశారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ను కాదని సచిన్ టెండూల్కర్‌ను అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేయడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నాయని ఆయన ఆరోపించారు.

సచిన్ పేరును చేర్చడానికి ధ్యాన్‌చంద్ పేరును తొలగించి ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, కేంద్ర క్రీడల మంత్రి భన్వర్ జితేంద్ర సింగ్, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రజల మనోభావాలను దెబ్బ తీశారని పిటిషన్ విమర్శించారు.
కేసును సిజెఎం విచారణకు స్వీకరించి డిసెంబర్ పదో తేదీకి వాయిదా వేశారు. ఈ కేసులో జెడియు పార్లమెంటు సభ్యుడు శివానంద తివారీని పిటిషనర్ సాక్షిగా చేర్చాడు. సచిన్ టెండూల్కర్ భారతరత్నకు తూగడని, ధ్యాన్‌చంద్‌ను కాదని టెండూల్కర్‌కు అవార్డు ఇవ్వడం సరైంది కాదని తీవారీ అన్నారు.












Click it and Unblock the Notifications