Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘ఏయ్, నేను లోకల్.. నన్నే డబ్బు కట్టమంటావా?..’, టోల్ ప్లాజా ఉద్యోగినిపై వాహనదారుడి వీరంగం!

న్యూఢిల్లీ: 'ఏయ్, నేను లోకల్.. నన్నే టోల్ ఫీజు కట్టమంటావా?' అంటూ ఓ ఉద్యోగినిపై ఓ వాహనదారుడు దాడి చేసిన ఘటన గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ద‌శ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి.

గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న ఖేర్కీ దౌలా టోల్ ప్లాజా వద్ద ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడి బూత్ నంబర్ 23లో విధులు నిర్వహిస్తోన్న ఓ ఉద్యోగిని టోల్ ఫీజు చెల్లించమని అడిగిన పాపానికి ఓ వాహనదారుడు హంగామా సృష్టించాడు.

నేను లోకల్, నాకు టోల్ గీల్ ఏమీ ఉండదంటూ ఆ మహిళా ఉద్యోగిని దుర్భాషలాడాడు. అడ్డు వచ్చిన సిబ్బందిపై బూతు పురాణం విప్పాడు. చేయి లోపలికి చాచి ఆ మహిళా ఉద్యోగిని కొట్టాడు. అతడ్ని పట్టుకోవడానికి టోల్ ప్లాజా ఉద్యోగులంతా ముందుకు రావడంతో అక్కడ్నించి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

అయితే అక్కడి భద్రతా సిబ్బంది అతడి కారుకు అడ్డంగా బారికేడ్లు అడ్డుపెట్టడంతో చివరికి దొరికిపోయాడు. దీంతో వారు అతడ్ని పోలీసులకు అప్పజెప్పారు. ఆ కాసేపు ఆ వాహనదారుడు చేసిన హల్‌చల్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయింది.

నిజానికి ఖేర్కీ దౌలా టోల్ ప్లాజా వద్ద ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇదేం కొత్తకాదు. నవంబరు 18వ తేదీన కూడా ఇలాగే ఓ మహిళా ఉద్యోగినిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వేధింపులకు పాల్పడ్డారు.

ఓ ఎస్‌యూవీలో వచ్చిన ఆ వ్యక్తులు తాము అధికార బీజేపీకి చెందిన వారమని, వెంటనే బారికేడ్ పైకెత్తాలంటూ ఆ మహిళా ఉద్యోగినిపై జులుం ప్రదర్శించారని టోల్ ప్లాజా పీఆర్వో కృపాల్ సింగ్ తెలియజేశారు.

మరో ఘటనలో.. అక్టోబరు 3న రాత్రి 2 గంటల సమయంలో బ్లాక్ స్కార్పియో వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి టోల్ ప్లాజా ఉద్యోగులు టోల్ ఫీజు చెల్లించమని అడగ్గా వారిపై ఏకంగా కాల్పులే జరిపాడు. ఏదేమైనా ఈ టోల్ ప్లాజా వద్ద తరచూ గొడవలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+