షాకింగ్: స్కూటీపైనుంచి పడిపోయిన మహిళ.. ఆమె తలపైనుంచి వెళ్లిన క్రేన్!
మహారాష్ట్రలోని ముంబై కర్ ఘర్ ప్రాంతంలో నివ్వెరపోయే ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మహిళ స్కూటీపై వస్తూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా, అదేసమయంలో వెనుక నుంచి వచ్చిన క్రేన్ ఆమె తలపైనుంచి వెళ్లిపోయింది.
ముంబై: మహారాష్ట్రలోని ముంబై కర్ ఘర్ ప్రాంతంలో నివ్వెరపోయే ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మహిళ స్కూటీపై వస్తూ అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా, అదేసమయంలో వెనుక నుంచి వచ్చిన క్రేన్ ఆమె తలపైనుంచి వెళ్లిపోయింది.
ఈ ఘటనలో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలి పేరు సుజాత పూరీ(34)గా పోలీసులు గుర్తించారు. ఆమె ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఆమె అనుకోకుండా మృత్యువాత పడ్డారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డయింది. దాని ఫుటేజ్ సాయంతో క్రేన్ డ్రైవర్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications